Roja Cricket Batting : మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిన జగన్..రోజా సంతోషం అంత ఇంత కాదు
- By Sudheer Published Date - 03:29 PM, Tue - 26 December 23

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని (Adudam Andhra Tournament) లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్ (CM Jagan) మైదానంలో సందడి చేసారు. బ్యాట్ (Batting ) చేతబట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు. స్పోర్ట్స్ అథారటీ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జగన్ కు బౌలింగ్ చేయగా..జగన్ బ్యాట్ తో బంతిని కొట్టే ప్రయత్నం చేసారు. ఇదే క్రమంలో మంత్రి రోజా (Roja) కు బ్యాటింగ్ నేర్పించి ఆమెను సంతోష పెట్టారు.
ఏపీ వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభమయ్యాయి. మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడు లోని లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ లాంచనంగా పోటీలను ప్రారంభించారు. సీఎం జగన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిందాంబి శ్రీకాంత్ కలిసి క్రీడాజ్యోతిని వెలిగించారు. సిహెచ్ రమాదేవికి క్రీడల టార్చ్ ను సీఎం జగన్ అందజేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో క్రీడా పోటీలను మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రారంభించారు. క్రీడా శాఖ మంత్రిగా రోజాకు సీఎం జగన్ అగ్ర తాంబూలం ఇచ్చారు. క్రీడాంశాల్లో ఒకటైన క్రికెట్ పోటీలను ప్రారంభించాలని రోజాను ఆహ్వానించారు.బ్యాటింగ్ చేయాలని సూచించారు. అయితే తనకు బ్యాటింగ్ రాదని రోజా చెప్పడంతో… సీఎం జగన్ స్వయంగా బ్యాట్ ఎలా పట్టాలో? షాట్ ఎలా కొట్టాలో?అవగాహన కల్పించారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
సుమారు 47 రోజులపాటు ఆడుదాం ఆంధ్ర పోటీలు జరగనున్నాయి. తొలి దశలో జనవరి 9వ తేదీ నాటికి గ్రామ / వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు జిల్లాస్థాయిలో, ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7:00 వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
రోజాకు బ్యాటింగ్ నేర్పించిన జగన్ !
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ తన కేబినెట్ మంత్రి ఆర్కే రోజాకు క్రికెట్ పాఠాలు నేర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడల మంత్రి ఆర్కే రోజాతో కలిసి పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆమెతో క్రికెట్ బ్యాట్… pic.twitter.com/Gjn7XNrzH1
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2023
Read Also : Driving In River : నదిలో జీపు డ్రైవింగ్.. ఎందుకిలా చేశారంటే ?