Prabhas : పొంగల్ కి ప్రభాస్ కూడా.. ఇదేం షాక్ బాబోయ్..!
ఈమధ్యనే సలార్ తో బాక్సాఫీ పై తన పంజా విసిరేందుకు వచ్చిన ప్రభాస్ (Prabhas) ఆ రేంజ్ లోనే వసూళ్లతో అదరగొట్టేస్తున్నాడు. ప్రశాంత్ నీల్, ప్రభాస్
- By Ramesh Published Date - 02:36 PM, Tue - 26 December 23
ఈమధ్యనే సలార్ తో బాక్సాఫీ పై తన పంజా విసిరేందుకు వచ్చిన ప్రభాస్ (Prabhas) ఆ రేంజ్ లోనే వసూళ్లతో అదరగొట్టేస్తున్నాడు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఈ కాంబో సినిమా ఎలా ఉండాలని ఫ్యాన్స్ అనుకున్నారో దానికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంది. ప్రభాస్ మాసిజం రెబల్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. క్రిస్ మస్ కి మూడు రోజుల ముందే ప్రభాస్ ట్రీట్ అదిరిపోయింది.
ఇక ఇప్పుడు సంక్రాంతికి కూడా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. ఈ క్రమంలో మారుతితో చేస్తున్న సినిమా నుంచి టీజర్ ని పొంగల్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ లో ఒక సినిమా వస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా టీజర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమాను కూడా 2024 సెకండ్ హాఫ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి సినిమా మే 9న రిలీజ్ లాక్ చేశారు. పొంగల్ కి టీజర్ మారుతి సినిమాపై ఒక అంచనాకు వచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు.
Also Read : Allu Arjun : అట్లీతోనే ఐకాన్ స్టార్.. మరి త్రివిక్రం ఏం చేస్తాడో..?
We’re now on WhatsApp : Click to Join
Related News
Salaar 2 : ప్రభాస్ ‘సలార్ 2’లోకి మరో మలయాళ స్టార్ నటుడు ఎంట్రీ.. ఏ పాత్ర కోసం..?
ప్రభాస్ 'సలార్ 2'లోకి మరో మలయాళ స్టార్ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఎవరు ఆ నటుడు..? ఏ పాత్ర కోసం..?