Jagan : చంద్రబాబు సెల్పీ ఛాలెంజ్ కు జగన్ మరో ఛాలెంజ్
టిడ్కో ఇళ్లతో చంద్రబాబు విసిరిన ఛాలెంజ్ ను జగన్మోహన్ రెడ్డి(Jagan) మరోరకంగా స్వీకరించారు. గత నాలుగేళ్లుగా అవినీతి రహిత పథకాలు
- By CS Rao Published Date - 01:10 PM, Wed - 12 April 23

టిడ్కో ఇళ్లతో చంద్రబాబు విసిరిన ఛాలెంజ్ ను జగన్మోహన్ రెడ్డి(Jagan) మరోరకంగా స్వీకరించారు. గత నాలుగేళ్లుగా అవినీతి రహిత పథకాలు, 2014-2019 మధ్య పథకాల మధ్య వ్యత్యాసాన్ని ఛాలెంజ్ గా తీసుకుందామని పిలుపునిచ్చారు. తన హయాంలో పూర్తిచేసిన ఇళ్ల వద్దకు వెళ్లి సెల్ఫీలు(selfy) తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు, పొదుపు సంఘాల మహిళల ఇంటి వద్దకు వెళ్లి సెల్ఫీలు అడిగితే ప్రజల స్పందన ఏమిటో తెలుస్తుందని చంద్రబాబుకు చురకలు వేశారు. లబ్దిదారుల ఇళ్ల వద్ద సెల్ఫీలు, స్టిక్కర్లు వేసే అధికారం టీడీపీకి లేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
టిడ్కో ఇళ్లతో చంద్రబాబు విసిరిన ఛాలెంజ్ (Jagan)
ఇటీవల నెల్లూరు వెళ్లిన చంద్రబాబు జోన్ 4 టీడీపీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ తరువాత టిడ్కో ఇళ్లను సందర్శించారు. అర్థాంతరంగా ఆపేసిన ఇళ్ల వద్ద సెల్ఫీ(Selfy) తీసుకున్న ఆయన ట్వీట్ చేశారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయకుండా ఆపేశారని ట్వీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి(Jagan) ఛాలెంజ్ చేశారు. దానికి ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద ఏర్పాటు చేసిన సభలో జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సంక్షేమ పథకాలను అందుకున్న వాళ్ల వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. గత పాలన కంటే ప్రస్తుతం అద్భుతంగా ఉందని జగన్మోహన్ రెడ్డి కితాబు ఇచ్చుకున్నారు.
గత పాలన కంటే అద్భుతంగా ఉందని జగన్మోహన్ రెడ్డి కితాబు
ముసలాయన పాలన అంటూ చంద్రబాబు వృద్ధాప్యాన్ని పదేపదే మార్కాపురం సభలో జగన్మోహన్ రెడ్డి(Jagan) గుర్తు చేశారు. గత పాలనలో ముసలాయన అంటూ పదేపదే చెప్పడం గమనార్హం. చంద్రబాబు వయస్సును 75ఏళ్లుగా చెబుతూ దాచుకో, దోచుకో, పంచుకో పద్ధతిలో పాలించాడని ఆరోపించారు. `పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా మీ బిడ్డ ఉంటాడు` అంటూ ధనికులకు, పేదలకు మధ్య జరుగుతోన్న రాజకీయ యుద్ధంలా రాబోవు ఎన్నికలను అభివర్ణించారు.
చంద్రబాబు వయస్సును 75ఏళ్లుగా చెబుతూ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి (Jagan)పాల్గొని వైఎస్ఆర్ ఈబీసీ పథకం కింద అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళల ఖాతాల్లో రూ. 15వేల చొప్పున నిధులు జమ చేశారు. గతేడాది ఈ పథకం కింద మొదటి విడతలో 3.92లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.589 కోట్ల నిధులను సీఎం జగన్ జమ చేసిన విషయం విధితమే. ఈ సభా వేదిక నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం రెండో విడతను సీఎం జగన్ ప్రారంభించారు. మొత్తం 4,39,068 మంది రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య కులాలకు చెందిన లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో 15వేలు చొప్పున రూ. 658 కోట్ల నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. గతేడాది ఈ పథకం కింద మొదటి విడతలో 3.92లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.589 కోట్లు జమ చేసిన విషయం విధితమే.
Also Read : CM Jagan: సీఎం జగన్ లండన్ పర్యటన ఎందుకో తెలుసా?
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా 45 నుంచి 60ఏళ్ల లోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కాచెల్లెమ్మలకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఒక్కో లబ్ధిదారుకు రూ. 15వేలను వారివారి బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తారు. బుధవారం సీఎం జగన్ (Jagan)పథకంకు సంబంధించి రెండో విడత నిధులను విడుదల చేశారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకం ద్వారా బుధవారం అందించిన రూ. 658.60కోట్లతో కలిపి రూ. 1,257.04 కోట్లు జమచేసింది.
Also Read : Jagan Plan: మా నమ్మకం నువ్వే జగనన్నా.. ప్రోగ్రాం ఫోకస్
ఈబీసీ నేస్తం పథకం బటన్ నొక్కిన తరువాత చంద్రబాబును టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, గత పాలనతో ఉదహరిస్తూ చెప్పారు. ముసలాయన పాలన అంటూ ఆనాడు చంద్రబాబు పథకాలతో ప్రస్తుతం పథకాలను పోల్చి వివరించారు. అబద్దాలను ప్రచారం చేస్తోన్న దుష్టచతుష్టయం మీద పేదలు విజయం సాధించాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం కొసమెరుపు.