CM Jagan: సీఎం జగన్ లండన్ పర్యటన ఎందుకో తెలుసా?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్తున్నారు.
- By Hashtag U Published Date - 09:22 AM, Tue - 11 April 23

Andhra Pradesh CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్తున్నారు. లండన్లో చదువుకుంటున్న కూతురుని చూసేందుకు సీఎం జగన్, సతీమణి వైఎస్ భారతితో కలిసి ఈ నెల 21న లండన్ వెళ్లనున్నారు. దాదాపుగా వారం రోజులపాటు లండన్‌లో గడపబోతున్నారు.
సీఎం జగన్ కుమార్తె వర్ష లండన్‌లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విద్య అభ్యసిస్తోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కళాశాలలో ప్రవేశం పొందడానికి, విద్యార్థులు ఇంటర్మీడియట్ అకాడమీలో 99 శాతం ఉతీర్ణత సాధించాలి. వర్ష తన కళాశాలలో మెరిట్ విద్యార్థి. దీంతో టాప్ కాలేజీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సంపాదించుకుంది. కూతురుని చూసేందుకు సీఎం దంపతులు ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో లండన్ వెళ్తుంటారు. వేసవి కావడంతో ఈ నెల 21న తేదీ ఖరారు అయినట్లు తెలుస్తుంది. అధికారికంగా తెలియాల్సి ఉంది.
మరోవైపు ఏపీలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీతో టీడీపీ, జనసేన ఢీ అంటే ఢీ అంటున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో దాడికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 7 నుంచి సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా వైసీపీ శ్రేణులు గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. ప్రతి గడపకు మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు అంటించే కార్యక్రమం హోరా హోరీగా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 1.6 కోట్ల ఇళ్ల వద్దకు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు వెళ్లి ప్రజలతో మాట్లాడనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిదొక కొత్త నినాదం. వాడవాడలా ప్లకార్డుల ప్రదర్శనా క్యార్యక్రమం జరుగుతోంది.