HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Hindu Opposition To Jaganmohan Reddys Hindu Spiritual Direction Programs For Second Chance

Jagan Hindu : చెప్పుల‌తో జ‌గ‌న్ యాగ‌శాల‌లోకి.! ఇదేం సంప్ర‌దాయం?

క్రిస్టియ‌న్ గా ముద్ర‌ప‌డిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హిందూ ఓట్ల (Jagan Hindu)స‌మీక‌ర‌ణ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో కీల‌క అంశంగా మారింది.

  • Author : CS Rao Date : 12-05-2023 - 3:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Hindu
Jagan Hindu

హిందూ ఓట్ల (Jagan Hindu)స‌మీక‌ర‌ణ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో కీల‌క అంశంగా మారింది. క్రిస్టియ‌న్ గా ముద్ర‌ప‌డిన ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) హిందూ సానుభూతిప‌రునిగా క‌నిపించే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టారని విప‌క్షాల ఆరోప‌ణ‌. ఆ క్ర‌మంలో యాగాలు, హోమాల‌ను అధికారికంగా నిర్వ‌హిస్తున్నారని చెబుతున్నారు. విశ్వాసాలు, న‌మ్మ‌కాలు వ్య‌క్తిగ‌త‌మైన‌వి అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ నిధుల‌తో వాటిని తీర్చుకోవ‌డం రాజ్యాంగ విరుద్ధం. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా దేవాదాయ‌శాఖ ఆధ్వ‌ర్యంలో యాగాలు, హోమాల‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

హిందూ ఓట్ల స‌మీక‌ర‌ణ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో (Jagan Hindu) 

యాగాలు, హోమాలు నిర్వ‌హించ‌డానికి కొన్ని నియ‌మాలు ఉంటాయి. వాటిని పాటించాల‌ని స‌నాత‌న ధ‌ర్మం చెబుతోంది. అందుకు విరుద్ధంగా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Hindu) కాళ్ల‌కు చెప్పులు వేసుకుని యాగ మండ‌పంలోకి ప్ర‌వేశించ‌డం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, భార్యాస‌మేతంగా యాగాలు, హోమాల‌కు హాజ‌రు కావాల‌ని స‌నాత‌న‌ధ‌ర్మం చెబుతోంది. కానీ, వైఎస్ భార‌తి (YS Bharati)ప‌క్క‌న లేకుండా యాగాలు, హోమాల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారం భూమి పూజ నిర్వ‌హించారు. పైగా చెప్పులు వేసుకుని ఆయ‌న యాగ‌శాల‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డాన్ని హిందూవాదులు త‌ప్పుబడుతున్నారు. చెప్పులు వేసుకుని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఫోటోల‌ను సోషల్ మీడియాలో ప్ర‌త్య‌ర్థులు వైర‌ల్ చేస్తున్నారు.

చెప్పులు వేసుకుని   యాగ‌శాల‌లోకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంట్రీ (Jagan Hindu)

సనాతన ధర్మ పరిరక్షణతోపాటు రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ కల్యాణ సౌభాగ్యాలతో వర్థిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(Jagan Hindu) పాల్గొన్నారు. ఉదయం 5గంటలకు మహామంగళ వాయిద్య హృద్య నాదం, భగవత్‌ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర–విష్వక్సేన పూజలు, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. సీఎం జగన్‌ యజ్ఞ సంకల్పం తీసుకున్న అనంతరం మహాయజ్ఞం ప్రారంభమైంది. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కపిల గోవుకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు.

నాలుగు ఆగమాల నడుమ మే 17వ తేదీ బుధవారం వరకు 6 రోజులపాటు ఈ మహాయజ్ఞం కొనసాగనుండగా వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు జరుగుతాయి. ఒక్కొక్క యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొలి రోజు ఉదయం మినహా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగుతాయి. పవిత్ర సప్తనదీ, త్రి సముద్ర జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించనున్నట్టు దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.

భక్తుల కోసం నాలుగు క్యూలైన్లు

యజ్ఞ కార్యక్రమాలను భక్తులు వీక్షించేలా ఉమ్మడిగా యాగశాలల చుట్టూ 4 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. యజ్ఞ కార్యక్రమాలను వీక్షిస్తూనే ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసేలా వీటిని తీర్చిదిద్దారు. వాటిలో ఒకటి వీఐపీల కోసం కేటాయించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ఆధ్వర్యంలో భక్తులకు రోజుకు ఒక ఆలయం చొప్పున ప్రసాదాల పంపిణీ చేపడుతున్నాయి. తొలిరోజు విజయవాడ దుర్గ గుడి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, చక్రపొంగ లి పంపిణీ చేస్తారు. యజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, 13న ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, 14న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, 16న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 17వ తేదీన చివరి రోజు సీఎం జగన్‌ చేతుల మీదుగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వ రూ­పానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర అన్వయంతో మహా పూర్ణాహుతితో యజ్ఞ కార్యక్రమాలు ముగుస్తాయి.

Also Read : Jagan Shocking : ఒకే రోజు జగ‌న్ కు రెండు షాక్ లు

రాజ్యాధికారం(Jagan Hindu) కోసం చేస్తోన్న యాగాల‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీలు చెబుతున్నాయి. కానీ, రాష్ట్ర స‌ర్వ‌తోభివృద్ధి కోసం అంటూ ప్ర‌భుత్వం చెబుతోంది. ఆరు రోజుల పాటు జ‌రిగే ఈ యాగాలు పూర్తిగా రెండోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం కావ‌డానికి చేస్తున్న‌విగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, స‌తీస‌మేతంగా హాజ‌రు కావాల్సిన ఆయ‌న (Jagan) ఒక్క‌డే క‌నిపించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. క్రిస్టియ‌న్ గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ప్రొజెక్ట్ చేస్తూ చెప్పులు వేసుకుని యాగ‌శాల‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డాన్ని ప్ర‌శ్నిస్తున్నాయి.

Also Read : Jagan war : ప‌వ‌న్ పొత్తుపై జ‌గ‌న్ `ప్యాకేజీ` వార్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • Anti-Hindu
  • Hindu Community
  • vijayawada

Related News

Ap Ev Charging Stations

ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

EV Charging Stations  ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. తొలి దశలో 135 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో 600 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో జాతీయ

  • Asus Opening

    ASUS : విజయవాడలో ఆసుస్ (ASUS) తన సరికొత్త ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ ప్రారంభం

Latest News

  • గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

  • TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

  • Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

  • Ration Card : రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd