HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Bro Controversy

BRO Controversy : జగన్ ఆ అంశాలను డైవర్ట్ చేయడానికే అంబటితో ‘బ్రో’ వివాదానికి తెరలేపాడా..?

ఇప్పుడు మరొకొన్ని అంశాలను డైవర్ట్ చేయడానికే జగన్ అంబటి రాంబాబు చేత బ్రో వివాదానికి తెరలేపారని

  • By Sudheer Published Date - 11:04 AM, Fri - 4 August 23
  • daily-hunt
Bro Controversy
Bro Controversy

 

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన బ్రో (BRO) మూవీ కాస్త రాజకీయ వివాదమైంది. సినిమాలో తనను వాడుకున్నారని మంత్రి అంబటి రాంబాబు మూడు రోజులుగా రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రచ్చ ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్లింది. బ్రో సినిమా కలెక్షన్లు , పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ , సినిమా బడ్జెట్ వంటి అంశాలపై సిబిఐ కి పిర్యాదు చేసేందుకు అంబటి ఢిల్లీ వెళ్లారు. ఇదంతా కూడా జగన్ మాస్టర్ మైండ్ ప్లాన్ అని జనసేన శ్రేణులు అంటున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ (AP Govt) వైఫల్యాలను ఎప్పుడు ప్రశ్నించిన వాటిని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక పనికిరాని వివాదాన్ని తెరమీదకు తీసుకరావడం వైసీపీ కి అలవాటే అంటున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వాలంటీరి వ్యవస్థలో లోపాలు జరుగుతున్నాయని , కొంతమంది వాలంటీరి ముసుగులో సంఘ విద్రోహ శక్తులకు పాల్పడుతున్నారు..ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారని , వృద్దులకు అందించాల్సిన పెన్షన్ లో కోతలు పెడుతున్నారని  వారాహి యాత్రలో ఆరోపణలు చేసారు. ఆ సమయంలో ఆ ఆరోపణల్లో నిజం లేదని నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం..రివర్స్ లో పవన్ కళ్యాణ్ ఫై వ్యక్తిగత విమర్శలకు దిగింది. కొంతమంది వాలంటీర్ల (AP Volunteers)ను ఉసిగొలిపి ధర్నాలకు దించే దౌర్భాగ్య స్థితికి చేరింది.ఆలా వారం రోజులా పాటు రచ్చ చేసి పవన్ లేవనెత్తిన అంశాలను ప్రజలు మరచిపోయేలా చేసారు.

ఇక ఇప్పుడు మరొకొన్ని అంశాలను డైవర్ట్ చేయడానికే జగన్ అంబటి రాంబాబు చేత బ్రో వివాదానికి తెరలేపారని అంటున్నారు.

1 ) వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్
2 ) వివాహిత తో పరారైన వాలంటీర్
3 ) ప్లాస్టిక్ వేలిముద్రలతో పెంక్షన్ల స్కామ్ చేస్తున్న వాలంటీర్
4 ) భారీ వర్షాలకు నీటమునిగిన ప్రదేశాల వాళ్ళకి సహాయ చర్యలు

1 ) వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్ :  పెందుర్తి నియోజకవర్గం సూజాతనగర్ లో 95వ వార్డు పురుషోత్తపురం పరిధిలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్..వరలక్ష్మీ(73) అనే వృద్ధురాలి వద్ద పార్ట్ టైమ్ పని చేస్తుంటాడు. జులై 30 న రాత్రి 10.30 గంటలకు వృద్ధురాలు ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను వెంకటేష్ హత్య చేసి , ఆమె ఒంటిమీద ఉన్న నగదును ఎత్తుకెళ్లాడు.

నెలనెలా ఇంటికి వచ్చి పెన్షన్ తెచ్చి అందించే వాలంటీర్ల పట్ల చాలా కుటుంబాలకు ముఖ్యంగా… మహిళలు, పెద్దవారికి నమ్మకం, అభిమానం ఏర్పడటం సహజం. వాలంటీర్ వెంకటేష్‌ పట్ల కూడా వరలక్ష్మి కుటుంబానికి అలాగే అభిమానం, నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే అతనికి వరలక్ష్మి పార్ట్-టైమ్ ఉద్యోగంలో పెట్టుకుంది. ఆ నమ్మకస్థుడే ఆమెను హత్య చేసాడు. పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన్నట్లు వాలంటీర్లు అందరూ ఈవిదంగానే ఉండరు. కానీ వారిలో కొందరు ఈవిదంగా కూడా ఉంటారని వెంకటేష్ నిరూపించాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అంత మాట్లాడుకునేలా చేసింది.

2) వివాహితతో పరారైన వాలంటీర్ : శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన వరలక్ష్మి (వివాహిత) , రేవళ్లపాలేనికి చెందిన వంకాయల దిలీప్‌ (27) ఇద్దరు వాలంటరీలుగా పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిచయం హద్దులు దాటింది. విషయం తెలిసి ఆమెను సచివాలయానికి పంపడం మానేశారు. భర్త. అయినప్పటికీ భర్త లేని సమయంలో దిలీప్..ఇంటికి వచ్చి వరలక్ష్మి తో మాట్లాడడం, ఆమెను బయటకు తీసుకెళ్లడం చేసేవాడు. ఈ విషయం తెలిసి భర్త మరోసారి ఆమెను మందలించారు. ఇలా కాదని వారిద్దరూ లేచిపోయారు. ఈ ఘటన కూడా పురుషుల్లో భయం పుట్టించింది. ఇంట్లో ఒంటారిగా ఆడవారు ఉన్న సమయంలో వాలంటరీలు ఇంటికి వచ్చి మాయ మాటలు చెప్పి..ఏదైనా చేసిన , లేవతీసుకొని పోయిన ఇంకేమైనా ఉందా అని ఊర్లలో మగవారు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

3) వర్షాలకు నీట మునిగిన ప్రదేశాల గురించి వాళ్ళకి సహాయ చర్యలు : ఇటీవల తెలంగాణ లో భారీ వర్షాలు కురిసాయి. ఏపీలో కూడా అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. అయితే గోదావరికి భారీగా వరద పోటెత్తడం తో ముంపు గ్రామాలు నీట మునిగాయి. ఇలా ప్రతి ఏడాది జరుగుతుండడం తో తమను ఆదుకోండని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా ఆలా పట్టించుకోకుండా ఉండేసరికి బాధితులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడ పెద్దది అవుతుందో అని దీనిని డైవర్ట్ చేసి ఆలోచన ప్రభుత్వం చేసింది.

4) ప్లాస్టిక్ వేలిముద్రణాలతో పెంక్షన్ స్కామ్ చేస్తున్న వాలంటీర్ : ప్రకాశం జిల్లాలో ఓ వాలంటీర్ అతి తెలివి ప్రదర్శించాడు. అధికారులతో సహా ఎవరికి దొరక్కుండా పక్కాగా ప్లాన్ చేసాడు. పామూరు మండలం పడమటికట్టకిందపల్లి పంచాయతీ పరిధిలోని కందులవారిపల్లిలో రాచగొర్ల గురుప్రసాద్‌ వాలంటీర్‌ గ్రామంలో ఉండకుండా..బెంగళూరులో ఉంటూ బయోమెట్రిక్‌ యంత్రంలో ప్లాస్టిక్‌ వేలిముద్ర వేస్తూ లబ్ధిదారుల పింఛను కొట్టేస్తున్నారు. ఇలా ప్రతి నెల కొందరి కొందరిగా తీసుకుంటూ వచ్చాడు. ఈ ఘటన ఫై ఆఫీసర్లకు తెలియడం తో వార్తల్లోకి ఎక్కింది. ఈ ఘటన ను ప్రజలు మాట్లాడుకోకుండా చేయాలనీ వైసీపీ ప్లాన్ చేసింది. ఇలా పలు రకాల అంశాలను ప్రజల నుండి డైవర్ట్ చేయడానికి జగన్..చేసిన ప్లానే బ్రో వివాదం అని జనసేన శ్రేణులు అంటున్నారు.

ఈ నాల్గు అంశాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పలేక..ప్రభుత్వ నిర్లక్ష్యం అందులో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి..వాటి నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రాన్ని వాడుకున్నారు. మంత్రి అంబటి రాంబాబు చేత వివాదానికి తెరలేపారని జనసేన శ్రేణులు అంటున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • ap
  • AP CM
  • ap volunteer issue
  • BRO Movie
  • bro movie controversy
  • Elderly woman murder
  • jagan
  • jagan plan
  • Pawan Kalyan
  • Volunteer Attack on Women
  • Volunteer Who Got Up with a Married Woman

Related News

World AIDS Day

AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ

AIDS Day : దేశంలో నమోదైన మొత్తం ఎయిడ్స్ కేసుల్లో అత్యధిక సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉంది. మహారాష్ట్ర (3,62,392) మరియు ఆంధ్రప్రదేశ్ (2,75,528) రాష్ట్రాలు ఈ కేసుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్నాయి

  • Sir Mp Lavu Krishnadevaraya

    SIR : ఏపీలోనూ SIR చేపట్టాలి – ఎంపీ లావు

  • Zone In Ap

    Zone : ఏపీలో జోనల్ వ్యవస్థ ఏర్పాటు – చంద్రబాబు కీలక నిర్ణయం

  • New Rule In Anna Canteen

    Anna Canteens : అన్న క్యాంటీన్లకు కమిటీలు

  • Cyclone Ditwah

    Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

Latest News

  • ‎Health Tips: ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన పిండితో.. చపాతీ చేసి తింటున్నారా.. డేంజర్ బెల్ మోగినట్లే!

  • ‎Nick Names: చిన్న పిల్లలను ముద్దుపేర్లతో పిలుస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

  • ‎Lakshmi Devi: అప్పుల బాధలు తిరిపోవాలా.. అయితే లక్ష్మిదేవికి ఈ మూడు వస్తువులు సమర్పించాల్సిందే!

  • Sugar Syrup: తీపి వంటకాల కోసం సరైన పద్ధతిలో పాకం తయారు చేయడం ఎలా?

  • Kohli Ignored Gambhir: కోహ్లీ- గంభీర్ మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయా? వీడియో వైర‌ల్‌!

Trending News

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd