India’s first Quantum Valley in Amaravati : అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు
India’s first Quantum Valley in Amaravati : దేశంలోనే తొలిసారిగా "క్వాంటం వ్యాలీ" (Quantum Valley)ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది
- By Sudheer Published Date - 09:24 PM, Tue - 6 May 25

రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత వేగం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం జరిగిన తర్వాత, భూముల కేటాయింపులో ప్రభుత్వం స్పష్టత చూపుతోంది. ఈ క్రమంలోనే దేశంలోనే తొలిసారిగా “క్వాంటం వ్యాలీ” (Quantum Valley)ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. కేవలం దేశీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయంగా కూడ ఇది ఆంధ్రప్రదేశ్‌కు విశేష గుర్తింపు తీసుకురానుంది.
Faria Abdullah : పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ కు రెడీ అంటున్న యంగ్ హీరోయిన్
ఇతర ప్రాజెక్టుల పరంగా కూడా అమరావతిలో వేగంగా అభివృద్ధి కొనసాగుతోంది. లా యూనివర్సిటీకి 50 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఇప్పటికే కేటాయించిన 15 ఎకరాలకు తోడు మరో 6 ఎకరాలు మంజూరు చేశారు. అలాగే ఐఆర్‌సీటీసీకి 1 ఎకరం, ఆదాయపు పన్ను శాఖ, రెడ్‌క్రాస్ సొసైటీ, కోస్టల్ బ్యాంక్‌లకు తగిన స్థలాలను కేటాయించారు. ఈ భూముల కేటాయింపుతో రాష్ట్రానికి కీలకమైన కేంద్ర మరియు ప్రైవేట్ సంస్థలు రావడానికి దారితీసింది.
Vijay Devarakonda : ‘కింగ్‌డమ్’ ను టెన్షన్ పెడుతున్న వీరమల్లు
ఇక నివాస భవనాల నిర్మాణం విషయంలోనూ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. గెజిటెడ్ అధికారుల కోసం రూ.514 కోట్లతో నివాస భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదనంగా మౌలిక వసతుల కోసం రూ.194 కోట్లు విడుదల చేయనున్నారు. అలాగే 9 టవర్లలో నాన్ గెజిటెడ్ అధికారుల కోసం నివాస ప్రాజెక్టుల నిర్వహణకు రూ.517 కోట్ల టెండర్లు మంజూరు చేశారు. వీటితో పాటు 15 ఓవర్‌హెడ్ ట్యాంకులు, రోడ్డు అనుసంధానాల కోసం మరో రూ.494 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. ఈ సమగ్ర చర్యలు అమరావతిని సాంకేతిక, విద్యా, వైద్య, నివాస రంగాల్లో దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దే దిశగా సాగుతున్నాయి.