Vizag Lands : జనవరి ఒకటి నుండి విశాఖలో భూముల రిజిస్ట్రేషన్ పెంపు
Vizag Land Registration : రుషికొండలో గజం రేటు రూ. 25,000 నుంచి రూ. 30,000కి పెరిగింది. అశీల్ మెట్టలో గతంలో రూ. 72,000గా ఉన్న గజం రేటు ఇప్పుడు రూ. 1,20,000గా నిర్ణయించారు
- Author : Sudheer
Date : 23-12-2024 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖలో భూముల రిజిస్ట్రేషన్ (Vizag Land Registration) విలువలను ప్రభుత్వం పెంచేందుకు సిద్ధమైంది. జనవరి 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భూముల రేట్లు మరియు రిజిస్ట్రేషన్ రేట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం ఈ నిర్ణయానికి దారితీసింది. అశీల్ మెట్ట, ఆర్టీసీ కాంప్లెక్స్, పాండురంగాపురం, రుషికొండ వంటి ఖరీదైన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు గణనీయంగా పెరిగాయి. ఉదాహరణకు, రుషికొండలో గజం రేటు రూ. 25,000 నుంచి రూ. 30,000కి పెరిగింది. అశీల్ మెట్టలో గతంలో రూ. 72,000గా ఉన్న గజం రేటు ఇప్పుడు రూ. 1,20,000గా నిర్ణయించారు. స్థలాల రేట్ల పెంపుతో పాటు అపార్టుమెంట్ల స్క్వేర్ ఫీట్ రేట్లు కూడా సవరించబడ్డాయి.
ఎంవీపీ కాలనీలో ప్రస్తుతం స్క్వేర్ ఫీట్ ధర రూ. 4,500గా ఉండగా, దానిని రూ. 5,300కి పెంచారు. మరింతగా కిర్లంపూడి లే ఔట్‌లో స్క్వేర్ ఫీట్ రేటు రూ. 6,000గా నిర్ణయించారు. గోపాలపట్నం, గాజువాక వంటి ప్రాంతాల్లో మాత్రం రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, అక్కడ కూడా కొద్దిపాటి పెంపు జరిగింది. గాజువాకలో స్క్వేర్ ఫీట్ ధర రూ. 2,500 నుంచి రూ. 3,000కి పెరిగింది. మధురవాడ పరిధిలో స్క్వేర్ ఫీట్ రేటు రూ. 4,700గా పెంచారు. భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపుతో ఖర్చులు పెరగడం సహజమే. అయితే ఇంటి రేట్లు పెరగడంతో పాటు బ్యాంకులు ఆస్తులపై రుణాల శాతం కూడా పెంచే అవకాశం ఉంది.
Read Also : Shyam Benegal Dies : శ్యామ్ బెనెగల్ మృతి