HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >In A First Markfed Begins Tobacco Export To Us

AP News : జ‌గ‌న్ స‌ర్కార్ అరుదైన రికార్డ్ !అమెరికాకు పొగాకు ఎగుమ‌తి!!

వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ ప్ర‌భుత్వం మ‌రో చ‌రిత్ర‌ను సృష్టించింది. మార్కెఫెడ్ కొనుగోలు చేసిన వ‌ర్జీనియా పొగాకును అమెరికాకు ఎగుమ‌తి చేస్తూ సంచ‌ల‌న రికార్ట్ ను న‌మోదు చేసింది

  • Author : CS Rao Date : 07-07-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan mohan reddy
Jagan mohan reddy

వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ ప్ర‌భుత్వం మ‌రో చ‌రిత్ర‌ను సృష్టించింది. మార్కెఫెడ్ కొనుగోలు చేసిన వ‌ర్జీనియా పొగాకును అమెరికాకు ఎగుమ‌తి చేస్తూ సంచ‌ల‌న రికార్ట్ ను న‌మోదు చేసింది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ చోటుచేసుకోని ఈ ప‌రిణామం జ‌గ‌న్ స‌ర్కార్ ఖాతాలోకి వెళ్లింది. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేసే రాష్ట్ర సంస్థ‌గా మార్కె ఫెడ్ సృష్టించిన చ‌రిత్ర దేశానికే త‌ల‌మానికం. ప్ర‌తి రాష్ట్రంలోనూ మార్క్ ఫెడ్ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయ‌డం మామూలే. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర లేన‌ప్పుడు రైతుల‌ను ఆదుకోవ‌డానికి ఏర్ప‌డిన సంస్థ అది. ఏనాడూ ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం మార్క్ ఫెడ్ ద్వారా రైతుల‌ను ఆదుకున్న దాఖ‌లాలు దాదాపుగా లేవు. కానీ, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం మార్క్ ఫెడ్ చ‌రిత్ర‌ను సృష్టించింద‌ని చెప్పాలి. దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రానికి చెందిన మార్క్ ఫెడ్ సంస్థ ఇప్ప‌టి వ‌ర‌కు వాణిజ్య పంట‌గా ఉన్న పొగాకును కొనుగోలు చేయ‌లేదు. కానీ, మొద‌టి సారిగా ఏపీ మార్క్ ఫెడ్ 2019 కోవిడ్ సంద‌ర్భంగా రైతుల‌ను ఆదుకోవడానికి పొగాకు కొనుగోలు చేసింది. వ‌ర్జీనియా పొగాకు రైతుల‌ను చాలా వ‌ర‌కు ఆదుకోగ‌ల‌గ‌డ‌మే కాకుండా దేశానికి ఆద‌ర్శంగా జ‌గ‌న్ స‌ర్కార్ నిలిచింది.

వాస్త‌వంగా 2018 నుంచి పొగాకు మార్కెట్ త‌గ్గింది. ఆ విష‌యాన్ని తెలియ‌చేస్తూ కేంద్ర వాణిజ్య‌శాఖ‌కు ఏపీ ప్ర‌భుత్వం లేఖ‌లు రాసింది. రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరింది. కానీ, కేంద్రం నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో రైతులు భారీగా న‌ష్ట‌పోయారు. సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత 2020లో మార్కెఫెడ్ ను రంగంలోకి దింపారు. సుమారు 13 మిలియ‌న్ కిలోల పొగాకును రైతుల నుంచి ఆ సంస్థ కొనుగోలు చేసింది. ఆ మొత్తంలో దాదాపు దేశీయ అవ‌స‌రాల కోసం 75శాతం నిల్వ‌ల‌ను అమ్మేసింది. మిగిలిన 120 ట‌న్నుల పొగాకును అమెరికాకు ఎగుమ‌తి చేసేందుకు ఏపీ స‌ర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేర‌కు నేరుగా ఎగుమ‌తి లైసెన్స్ ను పొందుతూ కాంట్రాక్టును కుదుర్చుకుంద‌ని టుబాకో బోర్డు ఎండీ ప్ర‌ద్యుమ్నా వెల్ల‌డించారు.

కేంద్రం నుంచి ఎలాంటి అనుమ‌తులు లేక‌పోయిన‌ప్ప‌టికీ సీఎం జ‌గ‌న్ ఆదేశం మేర‌కు మార్కెఫెడ్ ద్వారా వేలం కేంద్రాల‌కు వెళ్లి పొగాకు కొనుగోలు చేయ‌డం సాహ‌సమ‌ని ఎండీ అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి సాహ‌సం ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం చేయ‌లేదు. పైగా కేంద్రంగా ఆధీనంలోని టుబాకో బోర్డు చేయాల్సిన ప‌నిని రాష్ట్ర మార్కెఫెడ్ చేసింది. ఇప్పుడు ఆ పొగాకును అమెరికాకు నేరుగా ఎగుమ‌తి చేయ‌డం భార‌త‌దేశ చ‌రిత్ర‌లో జ‌గ‌న్ స‌ర్కార్ సాధించిన అత్యంత అరుదైన రికార్డ్ గా చెప్ప‌డం ఏ మాత్రం అతిశ‌యోక్తికాదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • tobacco products
  • YS Jagan Mohan Reddy

Related News

Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాంశాలపై సోషల్ మీడియాలో విమర్శలు చేసే యూట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ని వరుసగా అరెస్ట్ చేస్తుండటంపై నటుడు ప్రకాష్ రాజ్ శనివారం మరోసారి అత్యంత ఘాటుగా స్పందించారు. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన

  • Mavigan vs. Amaravati in the upcoming elections... YS Jagan's challenge!

    Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd