HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Important Instructions Of The High Court To The Visakha Sarada Peetham

Sharadha peetham : విశాఖ శారదా పీఠానికి హైకోర్టు కీలక ఆదేశాలు..!

తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖ శారదా పీఠానికి షాకిచ్చింది. తిరుమలలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

  • Author : Latha Suma Date : 24-01-2025 - 3:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Important instructions of the High Court to the Visakha Sarada Peetham..!
Important instructions of the High Court to the Visakha Sarada Peetham..!

Sharadha peetham : మరోసారి ఏపీలో శారదా పీఠం వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత వైసీపీ ప్రభుత్వం శారదా పీఠం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. పెద్ద ఎత్తున భూములు కేటాయించడం.. అలాగే తిరుమలలో భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖ శారదా పీఠానికి షాకిచ్చింది. తిరుమలలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

అనుమతులు లేకుండా జరిపిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీలులేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాన్ కు విరుద్దంగా నిర్మాణాలు ఎలా చేపడతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని శారదా పీఠానికి ఆదేశాలు ఇచ్చింది. రూల్స్ ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు శారదాపీఠం తరుఫు న్యాయవాది గడువు కోరగా.. అంగీకరిస్తూ విచారణ వాయిదా వేసింది.

కాగా, శారదా పీఠం తిరుమలలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతోందంటూ తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శారదా పీఠం అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నా కూడా.. టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పిటిషనర్ తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌‌ను గతంలోనే విచారించిన ఏపీ హైకోర్టు భవన నిర్మాణాన్ని ఆపివేయాలని శారదా పీఠాన్ని ఆదేశించింది. అయితే పిటిషన్ మీద బుధవారం మరోసారి విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

Read Also: Eggs Attack : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లతో దాడి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP high court
  • Building structures
  • demolition
  • Permissions
  • tirumala
  • Visakha Sarada Peetham

Related News

116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

తిరుమల శ్రీవారిపై ఉన్న అచంచల భక్తితో 116 ఏళ్ల వయసులో ఒక బామ్మ కాలినడకన కొండ ఎక్కింది. యువకులు సైతం ఆయాసపడే మెట్ల మార్గంలో ఆమె ఏ మాత్రం అలసట లేకుండా నడుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 116 ఏళ్ల వయసులోనూ కాలినడకన తిరుమల మెట్లు ఎక్కిన ఓ వృద్ధురాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. యువతకే సవాలుగా మారుతున్న ఈ ప్రయాణాన్ని ఆమె

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd