TDP : రెడ్ బుక్ ఫాలో అయితే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరు : వంగలపూడి అనిత
వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు.
- By Latha Suma Published Date - 02:45 PM, Sat - 1 March 25

TDP : ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అనంతపురంలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..వైసీపీ నేతల పై విమర్శలు గుప్పించారు. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలని హితవుపలికారు. ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు.. ఎన్డీయే ప్రభుత్వమన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. రెడ్ బుక్ ప్రకారం తాము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరంటూ వార్నింగ్ ఇచ్చారు.
Read Also: PM Modi : భారతదేశం ప్రపంచ శక్తిగా మార్పు చెందింది : ప్రధాని
ఇక, పోసాని అరెస్ట్‌పై కూడా అనిత స్పందిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 17 కేసులు ఉన్నాయని తెలిపారు. గతంలో మంత్రి నారా లోకేశ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై పోసాని చేసిన వ్యాఖ్యలు మానవ మాత్రుడు క్షమించ రాని తప్పని కామెంట్ చేశారు. తమ ప్రభుత్వం క్షక్షపూరిత రాజకీయాలు చేయడం లేదన్నారు. ఇక నుంచి తప్పు చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించది లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానే అని పోసానిని ఉద్దేశించి అన్నారు. ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని గోరంట్ల మాధవ్‌ను హెచ్చరిస్తున్నా నోటికొచ్చినట్టు మాట్లాడతాం అంటే కుదరదన్నారు.
అమరావతిలో ఉందన్న ఒకే ఒక కారణంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణాన్ని గోడలకే పరిమితం చేసింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వ పాపాలను ఒక్కొక్కటిగా సరిచేస్తూ వస్తున్నాం. హోం శాఖలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. త్వరలోనే నియామకాలు చేపట్టి ఇబ్బందులు లేకుండా చూస్తాం అని అనిత పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోలీసులకు రూ.900 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లింది. కూటమి అధికారంలోకి వచ్చాక దాదాపు రూ.250 కోట్ల బకాయిలు చెల్లించామని అన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
Read Also: Salary: ప్రతి నెల జీతం పొందగానే ఈ పని చేయండి.. మీ డబ్బు రెట్టింపు అవుతుంది!