HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >I Made A Promise To Modi Anna Lezhnevas Emotional Post Goes Viral

Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Author : Vamsi Chowdary Korata Date : 11-05-2026 - 9:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Meets Pawan Kalyan family
PM Meets Pawan Kalyan family

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను ప్రధాని స్వయంగా వెళ్లి పలకరించారు. ఆదివారం హైదరాబాద్‌లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ, తన పర్యటన ముగించుకుని నేరుగా పవన్ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anna Konidala (@anna.konidala)

ఈ భేటీలో పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాతే తిరిగి విధుల్లో చేరాలని, అప్పటివరకు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. “ముందు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి, పనుల గురించి ఆ తర్వాత ఆలోచించవచ్చు” అని మోదీ చెప్పినట్లు స‌మాచారం. పవన్ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా ఆయన పిల్లలతో ప్రధాని ఆప్యాయంగా ముచ్చటించారు.

ఈ పరామర్శ అనంతరం పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ తన భర్తకు ఇచ్చిన సలహాను, తనకు చెప్పిన మాటలను ఆమె తన పోస్టులో పంచుకున్నారు. “ముందు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, పూర్తిగా కోలుకున్నాకే పని మొదలుపెట్టాలని ప్రధాని మోదీ నా భర్తకు చెప్పారు. అలాగే నన్ను చూసి ‘మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి’ అన్నారు. ఆ పని నేను ఎంతో సంతోషంగా చేస్తున్నాను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధాని మోదీకి నేను మాటిచ్చాను” అని అన్నా లెజినోవా తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రధాని మోదీతో పవన్ కుటుంబ సభ్యులు దిగిన ఫొటోలు, అన్నా లెజినోవా పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ పోస్టుపై స్పందిస్తూ, తమ నేత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధానికి ఈ పరామర్శ నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anna Lezhneva
  • AP Deputy CM Pawan kalyan
  • health update
  • janasena party
  • narendra modi

Related News

Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అధికార కూటమిలో భాగం కాగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు, హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడం.. అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో.. వాటన్

  • Pawan Kalyan visits Niranjan's home; the Janasena chief is set to fulfill a fan's last wish!

    Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • Pawan Kalyan's comments on the 'Cockroach Party'

    Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పై పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd