Hyper Aadi : పవన్ గెలుపు కోసం ఎండను సైతం లెక్క చేయకుండా హైపర్ ఆది ప్రచారం
కాపు వీధి , గొల్లపూడి , కస్పా వీధి , పూసర్ల వీధి , కుమ్మర వీధులలో డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహిస్తున్న సమయంలో దారి పొడవునా మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు
- By Sudheer Published Date - 11:20 PM, Thu - 18 April 24

జబర్డస్త్ ఫేమ్ హైపర్ ఆది (Hyper Aadi) కి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సభ ఏదైనా , వేదిక ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ఎప్పటికప్పుడు చూపిస్తుంటారు. ఆ అభిమానమే..మెగా అభిమానుల్లో హైపర్ ఆది కి ప్రత్యేక స్థానం ఏర్పడేలా చేసింది. అంతే కాదు జనసేన కోసం అది ప్రచారం (Election Campaign) చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కూడా అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మండుఎండను సైతం లెక్కచేయకుండా ప్రతి ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని ,కూటమి ని గెలిపించాలని కోరుతూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గురువారం కశింకోటలోకూటమి నేతల కోసం ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆదికి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని షాపుల వద్దకు వెళ్లి వ్యాపారస్తులకు కొనుగోలుదారులకు జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఎన్నికల ప్రచార కరపత్రాన్ని అందజేసి ఈ ఎలక్షన్‌లో జనసేన గ్లాస్ గుర్తుపై ఓటు వేసి రామకృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా అది తో సెల్ఫీ దిగేందుకు యువకులు పోటీ పడ్డారు. కాపు వీధి , గొల్లపూడి , కస్పా వీధి , పూసర్ల వీధి , కుమ్మర వీధులలో డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహిస్తున్న సమయంలో దారి పొడవునా మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటె ఈ నెల 23న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ నామినేషన్ కార్యక్రమానికి భారీ జనసైనికులు తరలిరావాలని ఇప్పటికే పార్టీ పిలుపునిచ్చింది.
Read Also : Flax Seeds : అందాన్ని పెంచే అవిసె గింజలు.. ఎలా వాడాలంటే ?