HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Hyderabad Lady Doctor Who Gave Rs 1 5 Crore For Chembu

Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?

  • Author : Vamsi Chowdary Korata Date : 25-10-2025 - 2:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chembu
Chembu

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మరో మోసం జరిగింది. మహిమ గల చెంబు ఉందని నమ్మించి ఓ లేడీ డాక్టర్‌ను రూ.1.5 కోట్లు మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలా మోసపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇటీవల కాలంలో మోసాలు పెరిగిపోయాయి.. రైస్ పుల్లింగ్ పేరుతో కొందరు కేటుగాళ్లు అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. చాలామంది అమాయాకంగా నమ్మి ఏకంగా రూ.కోట్లలో నష్టపోయారు. తాజాగా అలాంటి ఘటన మరొకటి జరిగింది. మహిమ గల చెంబు ఉందని చెప్పి హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్‌ను బురిడీ కొట్టించింది ఓ గ్యాంగ్. డాక్టర్ మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు ఈ ముఠా ఆటకట్టించారు.. ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయకు చెందిన కొర్రా బంగార్రాజు, కర్నాటి ప్రసాద్‌ (గుంటూరు ప్రసాద్), పెందుర్తికి చెందిన వనుము శ్రీనివాస్‌‌లు ఓ గ్యాంగ్‌గా ఉన్నారు. ఈ ముగ్గురు ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ లేడీ డాక్టర్‌ను కలిశారు. ఆమెకు మహిమ గల చెంబు తమ దగ్గర ఉందంటూ మాయ మాటలు చెప్పారు. ఆ చెంబు ఖరీదు ఏకంగా రూ.30 కోట్లు విలువ చేస్తుందని నమ్మబలికారు. ఆ చెంబులో డబ్బులు వేస్తే డబుల్ అవుతాయని ఆమెను నమ్మించారు. ఆమె కూడా నిజమని నమ్మి వీళ్లకు విడతలవారీగా డబ్బుల్ని ఇచ్చారు. ఇలా ఈ ముగ్గురు డాక్టర్ దగ్గర నుంచి రూ.కోటిన్నర వరకు వసూలు చేశారు. డబ్బులు తీసుకున్న ఈ ముగ్గురు ఆ తర్వాత డాక్టర్‌‌కు అందుబాటులో లేకుండాపోయారు.

అలా ఆరు నెలలు గడిచిపోయింది.. ఈ ముగ్గురు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.. అలాగే డాక్టర్ ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. అప్పుడు తాను మోసపోయానంటూ ఈనెల 19న ఆరిలోవ పోలీసుల్ని లేడీ డాక్టర్ ఆశ్రయించారు. అప్పుడు ఈ కేసులో కీలక విషయాలు తెలిశాయి. ఈ చెంబు వ్యవహారంలో ఆరిలోవ హెల్త్‌సిటీలోని ఓ హోటల్, శ్రీకాంత్‌నగర్‌లోని ఓ హోటల్‌లో లావాదేవీలు జరిగాయని ఆధారాలను పోలీసులకు అందజేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ఎట్టకేలకు పోలీసులు ఈ నెల 23న ఆరిలోవ డంపింగ్‌యార్డు దగ్గుర ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విమ్స్‌ మెయిన్ గేటు దగ్గర మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల దగ్గర నుంచి రూ.2,41,400 డబ్బులతో పాటుగా మొబైల్స్, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ ఇంకా ఎవరినైనా మోసం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఉన్నత చదవులు చదివిన వారు కూడా ఇలా అమాయకంగా మోసపోవడం విచిత్రంగా ఉంది. మహిమ గల చెంబు పేరుతో డాక్టర్‌ను ఎలా నమ్మించారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chembu
  • hyderabad
  • lady doctor
  • Visakhapatnam

Related News

Cm Revanth Vs Aravind

రూ.7వేల కోట్లతో హైదరాబాద్ కు గోదావరి జలాలు – సీఎం రేవంత్

ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. రూ.7వేల కోట్ల ఖర్చుతో గోదావరి నదీ

  • Police Traffic Restrictions

    మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు

  • Free Ride

    నేడు మందుబాబులకు ఫ్రీ రైడ్

  • Musi River

    మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్

  • CM Revanth Reddy

    ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి!

Latest News

  • సామాన్యులకు భారీ ఊరట! భారీగా తగ్గనున్న ప్యూరిఫైయర్లు

  • మద్యం కావాలంటూ తిరుపతిలో ఆలయంపైకి ఎక్కి మందుబాబు హల్చల్

  • మరోసారి తండ్రి అయిన ఆది సాయి కుమార్

  • వచ్చే నెలలో డీఎస్సీ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు ?

  • దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్

Trending News

    • ఈరోజు సూపర్ మూన్ ఎన్ని గంటలకంటే !!

    • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

    • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

    • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

    • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd