Free Bus Scheme in AP : ఉచిత బస్సుతో ఒక్కొక్కరికీ ఎంత డబ్బు మిగులుతుందో తెలుసా..?
Free Bus Scheme in AP : మహిళలు ఈ పథకం ద్వారా నెలకు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఆదా అవుతుందని ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. అదే దూర ప్రాంతాలకు తరచూ ప్రయాణించే వారికి ఈ మొత్తం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
- By Sudheer Published Date - 01:08 PM, Sat - 16 August 25

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం(Free Bus Scheme)ను ప్రవేశపెట్టింది. స్త్రీ శక్తి అనే పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, ఏసీ, స్లీపర్, ఘాట్ రోడ్డు, నాన్-స్టాప్ వంటి బస్సులకు ఈ పథకం వర్తించదు. ఈ పథకం వల్ల ప్రతి మహిళకు ఎంత డబ్బు ఆదా అవుతుందనే అంశంపై ప్రస్తుతం విస్తృత చర్చ జరుగుతోంది.
Terrorist : ధర్మవరంలో ఉగ్రవాది అరెస్ట్
ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు (CBN), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించారు. ఈ సమయంలో బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో వారు మాట్లాడారు. నగర పరిధిలో రోజూ ప్రయాణించే బాలికలు, మహిళలు ఈ పథకం ద్వారా నెలకు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఆదా అవుతుందని ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. అదే దూర ప్రాంతాలకు తరచూ ప్రయాణించే వారికి ఈ మొత్తం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
Shubhanshu Shukla : స్వదేశానికి శుభాంశు శుక్లా .. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం!
ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేసే ఉద్యోగినులకు రూ.4000 నుంచి రూ.5000 వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే, దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్లే కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు మహిళలు ఉంటే మరింత ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. అవసరం లేకపోయినా, కేవలం ఉచిత ప్రయాణ సౌలభ్యం ఉందని ప్రయాణాలు చేసేవారు కూడా ఉంటారు. మొత్తం మీద, ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా గణనీయమైన లబ్ధి చేకూరుతుందని స్పష్టమవుతోంది.