SR Gudlavalleru Engineering College : అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు- విద్యార్థుల ఆందోళన
హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తూ డబ్బులు వసూళ్లు చేస్తుంది
- By Sudheer Published Date - 10:15 AM, Fri - 30 August 24

కృష్ణా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ (SR Gudlavalleru Engineering College) లో అమ్మాయిల హాస్టల్ (Girls Hostel) బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు (Secret Camera in Bathroom) ఉండటాన్ని గమనించిన విద్యార్థులు అర్ధరాత్రి నుండి ఆందోళన బాట పట్టారు. ఈ కెమెరా పెట్టింది ఓ అమ్మాయే కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తూ డబ్బులు వసూళ్లు చేస్తుంది. అదే కాలేజీ లో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థినే ఈ దారుణానికి పాల్పడింది. తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఇంతటి నీచానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. ఇద్దరూ కలిసి అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టించి వీడియోలు తీయిస్తున్నట్లు గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు అర్థరాత్రి ఇంజినీరింగ్ కాలేజీలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ, హాస్టల్ యాజమాన్యంపై డిమాండ్ చేసారు. అదే టైంలో ఇలాంటి పాడు పని చేసిన విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి దిగినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఎంతమంది అమ్మాయిల వీడియోలను తీశారు దీనికి కారణం ప్రేమ వ్యవహారామా..లేదా ఘటనకు కారణమైన అమ్మాయిని బెదిరించి ఇదంతా చేయించారా అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోలను వైసీపీ నేతలు షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు లోకేష్, పవన్ కల్యాణ్, చంద్రబాబుకు ట్యాగ్ చేసి విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు.
Read Also : Aston Martin V8 Vantage: కేవలం ఇద్దరు మాత్రమే కూర్చొగలరు.. ఈ కారు ధర రూ. 4 కోట్లు..!