Jagan Siddam : సిద్ధం సభ కారణంగా ట్రాఫిక్ మళ్లింపు ..
- By Sudheer Published Date - 01:00 PM, Sun - 10 March 24

జగన్ చివరి సిద్ధం (Siddham) సభ మరికాసేపట్లో అద్దంకిలోని.. మేదరమెట్ల హైవే పక్కన మొదలుకాబోతుంది. ఈ సభకు దాదాపు 15 లక్షల మంది హాజరు అవుతారని అంచనా. ఈ క్రమంలో హైవే ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నారు. నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్ కు దారి మళ్లించనున్నారు.
హైదరాబాద్ వైపు నుండి ఒంగోలు వైపుకు వచ్చే భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా దారి మళ్లించనున్నారు. నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే సాధారణ వాహనాలను మేదరమెట్ల వద్ద నుండి నామ్ హైవే పై అద్దంకి, సంతమాగులూరు మీదుగా మళ్లిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఒంగోలు వైపు నుండి వైజాగ్ వైపు NH 16 పై వెళ్లే వాహనాలను త్రోవగుంట నుండి NH 216 పైకి దారి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతున్నారు. ఒంగోలు వైపు నుండి విజయవాడ, గుంటూరు వైపు NH 16 పై వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా దారి మళ్లించారు. ఒంగోలు వైపు నుండి చిలకలూరిపేట వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా దారి మళ్లించారు. విశాఖపట్నం నుండి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలను నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించారు.
గుంటూరు నుండి ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుండి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించారు. చిలకలూరిపేట వైపు నుండి ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్ళు వాహనాలను పర్చూరు, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించారు. 16 వ నంబర్ జాతీయ రహదారి పై మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుండి బొల్లాపల్లి టోల్ ప్లాజా వరకు ఎటువంటి వాహనాలను అనుమతించరు. కేవలం సిద్ధం సభ ప్రాంగణానికి వచ్చు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
Read Also : Sand Mining Case: ఆర్జేడీ చీఫ్ కు ఈడీ షాక్, సన్నితుడు అరెస్ట్