Prakasam Barrage : ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు.. నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు
ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు పోటెత్తింది. తుపాను ప్రభావంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజ్‌లోకి భారీగా
- Author : Prasad
Date : 06-12-2023 - 5:06 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు పోటెత్తింది. తుపాను ప్రభావంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటికి తోడు జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్నాయి. దీంతో కృష్ణ నది పై విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీ కి వరద తాకిడి భారీగా పెరిగింది. బ్యారేజీ నిల్వ సామర్థ్యం 3.09 టీఎంసీలు మించి వరద నీరు ఉండడంతో అధికారులు గేట్లను ఎత్తి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి నిల్వను ఉంచుతూ దిగువకు సుమారు 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నాలుగు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు 6667 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో2908 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ ఫ్లో 7వేల క్యూసెక్కులు గా ఉంది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కుడి, ఎడమ కాలువులకు సాగునీటి విడుదలను అధికారులు నిలుపుదల చేశారు. బ్యారేజి నుండి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో నదీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లంక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాల్లోకి తరలిస్తున్నారు.
Also Read: MLA Rajasingh : కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఏడాదే అంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు