AP : షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దు అంటూ హర్షకుమార్ విజ్ఞప్తి
- By Sudheer Published Date - 04:22 PM, Thu - 11 January 24

అతి త్వరలో ఏపీ కాంగ్రెస్ (AP COngress) పగ్గాలు వైస్ షర్మిల (YS Sharmila) చేపట్టబోతుందని..ఈ తరుణంలో పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరడం ఖాయమని అంత అనుకుంటున్నా తరుణంలో షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దు అంటూ అధిష్టానానికి మాజీ ఎంపీ హర్షకుమార్ (EX MP Harsha Kumar) విజ్ఞప్తి చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ బిడ్డగా తాను రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల గతంలో చెప్పారని.. అలాంటి నాయకురాలు ఆంధ్రాలో బాధ్యతలు చేపడితే వచ్చే పరిణామాలను గ్రహించాలని సూచించారు. అందుకే తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగించవద్దన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గురువారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను కాంగ్రెస్ పార్టీకి ఒకే విషయం చెబుతున్నానని.. షర్మిలపై ఆ పార్టీకి అంతగా నమ్మకం ఉంటే ఏఐసీసీలోకి తీసుకోవచ్చునని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ చేసుకోవచ్చునని.. కర్ణాటక నుంచి పార్లమెంట్ సీటు లేదా రాజ్యసభకు పంపించవచ్చునని, దేశానికే స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోండని… కానీ ఏపీ బాధ్యతలు మాత్రం అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు. జగన్, షర్మిల ఒక్కటేనని.. అందుకే షర్మిలకు ఏపీ బాధ్యతలు ఇవ్వొద్దు అన్నారు.
ఇదే సందర్బంగా జగన్ ఫై నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో దళితులు నిరాధరణకు గురయ్యారని , వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ విద్యార్థులు సహా అందరికీ ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇస్తే జగన్ మాత్రం అందరికీ తీసేశారని ఆరోపించారు. జగన్‌ను గద్దె దింపడానికి దళితులంతా సిద్ధమయ్యారన్నారు. జగన్ ప్రభుత్వంలో ఎస్సీలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. దళితులకు ఒక్క కేసులోనూ న్యాయం జరగలేదన్నారు.
Read Also : Big Shock To BRS: బీఆర్ఎస్కు 20 మంది కౌన్సిలర్లు రాజీనామా