HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Harish Kumar Gupta As The New Dgp Of Andhra Pradesh This Is His Background

Harish Kumar Gupta : ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా.. చంద్రబాబు రాగానే కీలక ప్రకటన

అయితే ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్న  ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) వైపు సీఎం చంద్రబాబు  మొగ్గు చూపుతున్నారు.

  • Author : Pasha Date : 23-01-2025 - 2:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Kumar Gupta Ap New Dgp Andhra Pradesh Chandra Babu

Harish Kumar Gupta : హరీశ్ కుమార్ గుప్తా.. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీగా నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న  పదవీ విరమణ చేస్తారు. ఆ వెంటనే హరీశ్ కుమార్ గుప్తా ఏపీ పోలీస్ బాస్‌గా నియమితులు అవుతారు. తిరుమలరావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీగా కూడా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.  ఆయన డీజీపీగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్టీసీ ఎండీగా కొనసాగే అవకాశం ఉంది. వాస్తవానికి సీనియారిటీ లిస్టులో 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్న  ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) వైపు సీఎం చంద్రబాబు  మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆయనకే డీజీపీ పోస్టు దక్కే అవకాశాలు ఉన్నాయి.

Also Read :Death Threats : కపిల్ శర్మ సహా నలుగురు సెలబ్రిటీలకు హత్య బెదిరింపు.. ఆ ఈమెయిల్‌లో ఏముంది ?

ప్రస్తుతం విజిలెన్స్ విభాగంలో..

  • ఏపీ నూతన డీజీపీ కాబోతున్న హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి.
  • ప్రస్తుతం హరీశ్ కుమార్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా ఉన్నారు.
  • సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ గతంలో జగన్ హయాంలో ఆర్టీసీ ఎండీగా పని చేశారు. ఆ సమయంలో ఒక వివాదంలో ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుత ప్రభుత్వం ఆయనపై  విచారణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
  • మాదిరెడ్డి ప్రతాప్ గతంలో విచారణను ఎదుర్కొన్న అంశం అనేది హరీశ్ కుమార్ గుప్తా ఎంపికకు మార్గం సుగమం చేసింది.

Also Read :Saif Ali Khan : సైఫ్ పై నిజంగా దాడి జరిగిందా..? మంత్రి నితీష్ రాణే కీలక వ్యాఖ్యలు

  • ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దీంతో ఆయన స్థానంలో హరీశ్ కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది.
  • ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన టైం ఆయన డీజీపీ పోస్టులో ఉన్నారు.
  • ఆ తర్వాత కూటమి ప్రభుత్వ ప్రభుత్వం హరీశ్ స్థానంలో సీహెచ్ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది.
  • ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. కొంతకాలంగా వెయిటింగ్‌‌లో ఉన్న ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు దక్కాయి.
  • చంద్రబాబు స్విట్జర్లాండ్ (దావోస్ నగరం) నుంచి ఏపీకి తిరిగి వచ్చాక కొత్త డీజీపీ ఎంపికపై క్లారిటీ ఇవ్వనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP DGP
  • AP New DGP
  • chandra babu
  • Harish Kumar Gupta
  • new DGP

Related News

Mlc Anantha Babu Arrest

MLC Anantha Babu: మరో వారంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి.. జగన్ స్నేహితుడు అనంతబాబు జైలుకి

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ రద్దు. బెయిల్ రద్దు చేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు. సుబ్రమణ్యం హత్యకేసులో నలుగురు సాక్షులను ప్రలోభపెట్టిన అనంతబాబు. సాక్షుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు. సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును ఏప్రిల్ 24న అరెస్టు చేసిన పోలీసులు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుల

  • Tdp

    TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

  • Deputy CM to arrive in AP today

    Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

  • Minister Narayana inspected the MLA and MLC buildings in Amaravati.

    AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

  • Key Meeting with Union Minister C.R. Patil Chandrababu

    Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

Latest News

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

  • iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd