Saif Ali Khan : సైఫ్ పై నిజంగా దాడి జరిగిందా..? మంత్రి నితీష్ రాణే కీలక వ్యాఖ్యలు
Saif Ali Khan : నిజంగానే సైఫ్ అలీఖాన్ దాడికి గురయ్యారా.. లేక నటిస్తున్నారా అని ప్రశ్నించారు
- By Sudheer Published Date - 01:57 PM, Thu - 23 January 25

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి (Attack) జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 16న ముంబైలోని తన నివాసంలో దొంగతనం ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో ఆయనపై దుండగుడు కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో సైఫ్‌కు తీవ్ర గాయాలవడంతో వెంటనే లీలావతి ఆస్పత్రి లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత డాక్టర్స్ ఆయనకు చికిత్స అందించి..కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసారు. అయితే సైఫ్ పై జరిగిన దాడి పైమహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే (Nitesh Rane) కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే సైఫ్ అలీఖాన్ దాడికి గురయ్యారా.. లేక నటిస్తున్నారా అని ప్రశ్నించారు.
Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా.. ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలు పెడతారు?
తాజాగా ఈ దాడి ఘటనపై ఆయన స్పందిస్తూ.. ప్రతిపక్ష నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సుప్రియా సూలే, జితేంద్ర అవద్ వంటి నేతలు కేవలం ముస్లిం నటీనటులపైనే శ్రద్ధ చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి ఇతర నటీనటులపై ఎవరూ స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై నితీష్ రాణే చేసిన మరో వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి నడుస్తూ వెళ్తున్న వీడియోను ప్రస్తావించిన నితీష్ రాణే.. ఆయనకు నిజంగానే కత్తిపోటు గాయాలు అయ్యాయా లేక నటిస్తున్నారా అనే సందేహం వ్యక్తం చేశారు. అలాగే బంగ్లాదేశీయులు ఇదివరకు రోడ్ల క్రాసింగ్‌ల వద్ద కనిపించేవారు, కానీ ఇప్పుడు ఇళ్లలోకి ప్రవేశించడం ప్రారంభించారని వ్యాఖ్యానించారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వారు ఆగంతకులై ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.
#WATCH | Pune: Maharashtra Minister Nitesh Rane says, “Look at what Bangladeshis are doing in Mumbai. They entered Saif Ali Khan’s house. Earlier they used to stand at the crossings of the roads, now they have started entering houses. Maybe he came to take him (Saif) away. It is… pic.twitter.com/XUBwpwQ6RQ
— ANI (@ANI) January 23, 2025