Gudivada Amarnath : ఏపీలో దాడులపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం
45 రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఈ దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, హత్యాప్రయత్నాల మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు
- By Sudheer Published Date - 08:46 PM, Thu - 18 July 24

ఏపీలో కూటమి (NDA Govt ) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి దాడులు , హత్యలు , అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ (YCP) ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పలు ఘటన ఫై గవర్నర్ కు పిర్యాదు చేయగా..నిన్న వినుకొండ లో నడిరోడ్డు ఫై ఓ వ్యక్తిని అతి దారుణంగా నరికి చంపేసిన ఘటన అందర్నీ భయబ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన ఫై ఇప్పటికే వైసీపీ రాష్ట్రపతికి పిర్యాదు చేయగా..తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) స్పందించారు.
We’re now on WhatsApp. Click to Join.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 31 మంది ప్రాణాలు బలిగొన్నారని, వెయ్యికి పైగా దాడులు జరిగాయని , 35 మందిని ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించారని 300కు పైగా హత్యాయత్నాలు చేశారని లెక్కలతో సహా బయటపెట్టారు. ఇక నిన్న వినుకొండలో జరిగిన దారుణ ఘటన దేశాన్ని కుదిపేసిందని, నడిరోడ్డుపై జనం, పోలీసులు ఉండగానే రెండు చేతులు అమానుషంగా నరికి ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మాత్రమే కాదు ఈరోజు ఎంపీ మిధున్ రెడ్డిపై పుంగనూరులో రాళ్ల దాడి చేశారని, ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారని నిప్పులు చెరిగారు. 45 రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఈ దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, హత్యాప్రయత్నాల మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
Read Also : Darling : ‘డార్లింగ్’ ప్రీమియర్ షో టాక్…