Darling : ‘డార్లింగ్’ ప్రీమియర్ షో టాక్…
డార్లింగ్ సినిమా ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని..ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయొచ్చని , భార్య భర్తల నేపథ్యంలో కొన్ని సినిమాలు తెలుగులో వచ్చినప్పటికీ... 'డార్లింగ్'లో టచ్ చేసిన పాయింట్ చాల కొత్తగా ఉంటుందని
- Author : Sudheer
Date : 18-07-2024 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
బలగం ఫేమ్ ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) హీరోగా నభా నటేష్ (Nabha Natesh) హీరోయిన్ గా నటించిన యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’ (Darling ). అశ్విన్ రామ్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేయగా హనుమాన్ మూవీ ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు (జూలై 19న) ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుండగా.. ఒక్క రోజు ముందు ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. ప్రీమియర్ షో చూసిన అభిమానులు సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
డార్లింగ్ సినిమా ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని..ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయొచ్చని , భార్య భర్తల నేపథ్యంలో కొన్ని సినిమాలు తెలుగులో వచ్చినప్పటికీ… ‘డార్లింగ్’లో టచ్ చేసిన పాయింట్ చాల కొత్తగా ఉంటుందని..ప్రియదర్శి , నాభ యాక్టింగ్ సూపర్బ్ అంటున్నారు. సరికొత్త కథతో సినిమాను నడిపించాడని..ఈ మధ్య ఇలాంటి సినిమాలు రాలేదని చెపుతున్నారు. ప్రియదర్శి బలగం తో కన్నీరు పెట్టిస్తే..డార్లింగ్ తో నవ్వుల్లో ముచ్చాడని కొనియాడుతున్నారు. నభా నటేష్ సైతం యాక్షన్ సీన్లలో ఇరగదీశారట. వివేక్ సాగర్ పాటలు, నేపథ్య సంగీతం సైతం అందరికీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
Read Also : Farmers Celebrating : తెలంగాణలో అంబరాన్ని తాకుతున్న రైతుల సంబరాలు