HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Govt Action On Anganwadi Workers

Andhra Pradesh : అంగన్‌వాడీల తొలగింపునకు ప్ర‌భుత్వం సన్నాహాలు.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ ..?

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలను విధుల

  • Author : Prasad Date : 21-01-2024 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anganwadi Workers
Anganwadi Workers

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలను విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొన్న గడువు పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే నిబంధనల మేరకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రోస్టర్‌ పాయింట్ల వివరాలు సేకరించారు. ఇతర పనులు చేపట్టేందుకు శనివారం రాత్రి, ఆదివారం కూడా క్షేత్రస్థాయిలో అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశాలు వెళ్లాయి.. విధుల్లో చేరేందుకు అంగన్‌వాడీలకు శనివారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం గడువిచ్చింది. సాయంత్రం 4 గంటల వరకు చేరినవారి, చేరనివారి వివరాలు తీసుకుంది. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే 5 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో అసత్యాలు పేర్కొన్నారని, చర్యలు తీసుకునే ముందు తమ వాదనను వ్యక్తిగతంగా వినాలని అంగన్‌వాడీలు సమాధానమిచ్చారు. దీన్ని అనుసరించాల్సిన అవసరం లేదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించినా… ఎన్ని రకాలుగా వారిపై ఒత్తిడి తెచ్చినా శనివారం నాటికి విధుల్లో చేరింది 10 శాతంలోపే. అంగన్‌వాడీలు సంఘటితంగా పోరాట ఉద్ధృతిని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.04 లక్షల మంది అంగన్‌వాడీలున్నారు.

Also Read:  YSRCP : వైసీపీ ఐదో జాబితాపై కొన‌సాగుతున్న క‌స‌ర‌త్తు.. ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న నేత‌లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Anganwadi wokers
  • Anganwadi Workers Protest
  • AP CM Jagan

Related News

Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.  ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ విషాదానికి కారణం వరలక్ష్మి డెయిరీ నుంచి వచ్చిన కల్తీ పాలు అని గుర్తించబడింది.

    Latest News

    • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

    • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

    • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

    Trending News

      • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

      • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

      • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

      • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

      • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd