Annadata Sukhibhava : అన్నదాతా సుఖీభవ రైతులకు గుడ్ న్యూస్
Annadata Sukhibhava : ఈ పథకానికి అర్హులైన రైతులు ఇకపై ఈకేవైసీ (e-KYC) ప్రక్రియ కోసం రైతు సేవా కేంద్రాల (RSK)కు వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
- By Sudheer Published Date - 07:20 AM, Tue - 17 June 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాతా సుఖీభవ (Annadata Sukhibhava) పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకానికి అర్హులైన రైతులు ఇకపై ఈకేవైసీ (e-KYC) ప్రక్రియ కోసం రైతు సేవా కేంద్రాల (RSK)కు వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రకటన రైతులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 45.65 లక్షల మంది అర్హులలో 44.19 లక్షల మంది రైతుల డేటాను ఆటోమేటిక్‌గా అప్డేట్ చేసింది.
Narendra Modi : సైప్రస్‌లో ప్రధాని మోదీకి అనూహ్య స్వాగతం.. మోదీ పాదాలకు నమస్కరించి
ఈ ప్రక్రియలో సరైన ఆధారాలు లేకపోయిన 1.45 లక్షల మంది రైతులకే వేలిముద్ర (బయోమెట్రిక్) ఆధారంగా నమోదు అవసరం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరి వివరాలను ఇప్పటికే ఆయా మండలాల్లోని రైతు సేవా కేంద్రాలకు పంపించారు. ఇది వారికి కేవలం ఒకే ఒక్కసారి చేయాల్సిన ప్రక్రియగా ఉంటుంది. అవసరమైన ఆధారాలు అందించిన తర్వాత ఈ రైతుల వివరాలు కూడా ప్రభుత్వం డేటాబేసులో నమోదు చేయనుంది.
Liquor Scam : లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిదే కీలకపాత్ర – సీఐడీ
ఈ నెల 20వ తేదీకి ముందే ఈ ప్రక్రియను పూర్తిచేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతులకు మరిన్ని అసౌకర్యాలు లేకుండా, వ్యవస్థను మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అన్నదాతా సుఖీభవ వంటి పథకాలు నేరుగా రైతుల బాగోగులకే లక్ష్యంగా ఉండటంతో, ప్రభుత్వం వీటిని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది.