HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mithun Reddy Played A Key Role In The Liquor Scam

Liquor Scam : లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిదే కీలకపాత్ర – సీఐడీ

Liquor Scam : మద్యం కేసుకు సంబంధించి మిథున్‌రెడ్డి గతంలో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషనర్‌పై అప్పటికే ఆధారాలు ఉన్నాయని, ముడుపుల సొమ్ము చివరికి ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందన్న అంశంపై విచారణ కొనసాగుతోందని సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు

  • Author : Sudheer Date : 17-06-2025 - 7:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Liquor Scam Midhun Reddy
Liquor Scam Midhun Reddy

వైసీపీ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం (Liquor Scam)లో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి (Midhun Reddy)కీలక పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తరఫున హైకోర్టులో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో మిథున్‌రెడ్డి చురుకుగా పాల్గొన్నారని, ముడుపులు చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారని పేర్కొన్నారు. రూ.3,500 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని ఆయన వాదించారు. డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి వచ్చిన రూ.5 కోట్లు మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కి చేరాయని, ఆ కంపెనీ మిథున్‌రెడ్డి కుటుంబానికి చెందినదేనని పేర్కొన్నారు.

CM Revanth Reddy : సిక్స్ ప్యాక్ పై యువతకు సలహా ఇచ్చిన సీఎం రేవంత్

మద్యం కేసుకు సంబంధించి మిథున్‌రెడ్డి గతంలో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషనర్‌పై అప్పటికే ఆధారాలు ఉన్నాయని, ముడుపుల సొమ్ము చివరికి ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందన్న అంశంపై విచారణ కొనసాగుతోందని సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. పిటిషనర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించడం అవసరమని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో ఇప్పటికే కొందరు నిందితులు అప్రూవర్లుగా మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆయన వెల్లడించారు. పూర్తి వాదనల కోసం సమయం అవసరమై, విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు తెలిపారు.

KTR : కావాలంటే 15 రోజులు జైలుకు పంపండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మిథున్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి, పిటిషనర్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. డీకార్ట్ నుంచి వచ్చిన రూ.5 కోట్లను తిరిగి అదే సంస్థకు చెల్లించామని, ఎలాంటి అక్రమ ప్రయోజనం పొందలేదన్నారు. ఇప్పటికే సిట్‌కు పూర్తి వివరణ ఇచ్చినట్టు తెలిపారు. మద్యం పాలసీలో మిథున్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, కేసులో ఇతర ప్రధాన నిందితులను పోలీసులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పిటిషనర్‌ను అరెస్ట్ చేసి వేధించేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఆయన వాదించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP high court
  • CID
  • liquor scam
  • midhun reddy

Related News

Amaravati Inner Ring Road Case

Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

Chandrababu  ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐకి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు దర్యాప్తును అప్పగించాలని, ఈ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని, ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

    Latest News

    • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

    • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

    • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd