HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Drug Addicts Huge Reduction In Liquor Prices In Ap

మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

  • Author : Vamsi Chowdary Korata Date : 10-03-2026 - 2:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Liquor Prices
Ap Liquor Prices

AP Liquor Prices ఏపీలో మద్యం ధరల తగ్గింపు ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మధ్యం ధరల్ని తగ్గించాలని ఎక్సైజ్ శాఖ అదికారులు ప్రతిపాదించారట. ఈ అంశంపై త్వరలోనే కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోకి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ విచ్చలవిడిగా వస్తుండటంతో ఆదాయం తగ్గుతోంది. అందుకే ధరలు తగ్గించాలని భావిస్తున్నారట. అయితే ధరల తగ్గింపుపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం ఉందట. దీనికి తోడు కొంతకాలంగా రాష్ట్రంలో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ హవా పెరిగిందట. ఉదాహరణకు తెలంగాణలో విదేశీ లిక్కర్ బాటిల్ ధర రూ.22వేలు ఉంటే.. ఏపీలో రూ.25 వేల వరకు అమ్ముతున్నారట.. అలా బ్రాండ్‌ను బట్టి ప్రీమియం లిక్కర్ ధర మారుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ప్రీమియం లిక్కర్ ధరలు తక్కువగా ఉండటంతో.. ఏపీలో అమ్మకాలు తగ్గాయట. ప్రీమియం బ్రాండ్ల లిక్కర్ అమ్మకాలు పెరగాలంటే.. ధరలు తగ్గాలనే ప్రతిపాదనలు వచ్చాయట. ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.

ప్రీమియం లిక్కర్ ధరల తగ్గింపు నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి ఆమోదిస్తే ధరలు తగ్గుతాయంటున్నారు. ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే 20 ప్రీమియం బ్రాండ్ల మధ్యం ధరలు తగ్గునున్నాయని చెబుతున్నారు. అప్పుడు రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వ ప్రీమియం లిక్కర్ ధరలు తగ్గిస్తే ఒక్కో బాటిల్‌పై రూ.2వేల నుంచి రూ.3వేల వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రీమియం లిక్కర్ ధరల తగ్గింపుపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని పూర్తిగా మార్చేసింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్ని ప్రభుత్వం నడిపించగా.. కూటమి ప్రభుత్వం మళ్లీ టెండర్ల విధానాన్ని తీసుకొచ్చింది. దాదాపు 40 బ్రాండ్ల మద్యం ధరల్ని కూడా తగ్గించారు.. అయితే ప్రీమియం బ్రాండ్ల ధరలు మాత్రం తగ్గించకపోవడంతో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ విచ్చలవిడిగా వస్తోందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. అందుకే ప్రీమియం బ్రాండ్ల ధరల్ని తగ్గించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వైన్ ధరలు కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఏదైనా రాష్ట్రంలో మద్యం విక్రయించాలంటే ప్రభుత్వానికి ఎక్సైజ్ డ్యూటీతో పాటూ పన్నులు చెల్లించాలి. ఆ పన్నులు చెల్లించకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తే దానిని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటారు.. ఇది చట్టరీత్యా నేరం. కొన్ని రాష్ట్రాల్లో మధ్యం ధరలు తక్కువగా ఉంటాయి.. అందుకే అక్కడ తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh Govt
  • AP CM Chandrababu
  • Ap Liquor price
  • ap liquor sale
  • liquor price
  • Liquor Price down
  • liquor prices
  • Liquor prices decreased

Related News

Liquor Price Down

Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

ఒకే బ్రాండ్ మద్యం సీసా తెలంగాణలో లభించే ధర కంటే ఏపీలో సుమారు రూ. 3,000 నుండి రూ. 6,000 వరకు అదనంగా ఉంటోంది. ఈ భారీ వ్యత్యాసం కారణంగా రాష్ట్రంలో 'నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్' (NDPL)

  • AI Services In AP Government Hospitals

    ఏపీలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు

  • Ap Liquor Shops

    మందుబాబులకు ఓ శుభవార్త.!

  • Social Media Banned Ap

    ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన

Latest News

  • బ్రెయిన్ ఫాగ్.. ఇది ఒక వ్యాధా?

  • Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!

  • Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

  • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

  • Mega Family : పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగా కోడలు

Trending News

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd