AP Priests : అర్చకుల జీతం రూ.15వేలకు పెంపు – సీఎం చంద్రబాబు
అర్చకుల వేతనాన్ని రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు
- By Sudheer Published Date - 08:43 PM, Tue - 27 August 24

ఏపీలో కూటమి సర్కార్ (CHandrababu) అన్ని వర్గాల ప్రజలకు వరుస తీపి కబుర్లు అందజేస్తూ వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తూ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తూ వస్తుంది. ఓ పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటూనే..మరోపక్క రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ వస్తుంది. ఇదే క్రమంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చిన సర్కార్..తాజాగా అర్చకుల (AP Priests) వేతనాన్ని రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join.
మంగళవారం దేవాదాయ శాఖపై సమీక్షించిన ఆయన ‘ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.5000 నుంచి రూ. 10,000కు పెంచాలి. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3వేలు భృతి ఇవ్వాలి. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని సంబంధిత మంత్రి, అధికారులను ఆదేశించారు.
అలాగే దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. బలవంతపు మత మార్పిడులు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. ఆలయాల్లో అపచారాలకు చోటు ఉండకూడదని, ఆధ్యాత్మికత వెల్లివిరియాలని సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధి కోసం దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖ మంత్రులతో కమిటీ వేస్తామన్నారు. సింహాచలం పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also : Pushpa 2 : పుష్ప పార్ట్ 3 కూడా ఉందట.. టైటిల్ అదేనట..!