Realme: రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీగా డిస్కౌంట్.. పూర్తి వివరాలు ఇవే?
కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే మరొకవైపు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
- By Anshu Published Date - 01:02 PM, Tue - 30 July 24

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంటే ఒక వైపు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే మరొకవైపు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజాగా కూడా రియల్ మీ సంస్థ 5g స్మార్ట్ ఫోన్ పై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏది? ఆ స్మార్ట్ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ ను అందిస్తోంది అన్న వివరాల్లోకి వెళితే..
రియల్‌మీ ఈ సేల్‌లో రియల్‌మీ నార్జో 70ఎక్స్ 5జీ కొత్త 8 జీబీ ర్యామ్ కాన్ఫిగరేషన్ ఫోన్‌ను నేరుగా రూ.2000 డిస్కౌంట్ తో విక్రయిస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ, గొప్ప కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ వంటి రంగుల్లో లభించనుంది. అయితే ఈ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ను డీబీఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అంటే కూపన్ డిస్కౌంట్‌తో బ్యాంక్ డిస్కౌంట్ పొందితే మొత్తం రూ.3500 తక్కువతో ఫోన్ లభిస్తుంది. దీంతో పాటు పాత ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.11,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే రియల్‌మీ చౌకైన నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ పాలిష్డ్ సన్‌బర్స్ట్ ఆకృతి, సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఐపీ 54 రేటింగ్ కలిగి ఉంది. ఇది నీరు, ధూళిని తట్టుకునేలా చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మినీ క్యాప్సూల్ 2.0ను అందిస్తుంది. ఇది ఆపిల్ డైనమిక్ ఐలాండ్‌ను పోలి ఉంటుంది. డైనమిక్ బటన్ కూడా ఉంది, ఇది ఆపిల్ యాక్షన్ బటన్‌ను పోలి ఉంటుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.72 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. రియల్ మీ యూఐ 5.0, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. నార్జో 70ఎక్స్ 5జీలో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనో కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను కూడా అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. ఇది 15.9 గంటల యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్‌ను ఇస్తుంది. 45 వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్, యూఎస్బీ టైప్ సీ పోర్టు ఈ ఫోన్ లో ఉన్నాయి.