HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Free Bus Travel In Ap From This Sankranti Key Announcement By Government Whip

Free Bus In AP: ఏపీలో ఈ సంక్రాంతి నుంచే ఉచిత బస్సు ప్రయాణం? ప్రభుత్వ విప్ కీలక ప్రకటన…

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అమలుకు తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచే ఈ పథకం అమలు చేసేలా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

  • Author : Kode Mohan Sai Date : 10-12-2024 - 12:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free Bus In Ap
Free Bus In Ap

ఆంధ్రప్రదేశ్‌ మహిళలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త రానే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం సంక్రాంతి పర్వదినం నుంచి అమలులోకి రానుంది. ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఈ శుభవార్తను ప్రకటించారు. “సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి మొదలు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు. ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని విధి విధానాలు రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం” అని ఆయన పోస్ట్ చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Yarlagadda Venkatrao's Post

Yarlagadda Venkatrao’s Post

ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు:

  • ఆర్థిక భారం తగ్గుదల: మహిళలకు ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి.
  • స్వేచ్ఛా ప్రయాణం: మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు.
  • సాధికారత: మహిళల సామాజిక, ఆర్థిక సాధికారతకు ఈ పథకం దోహదపడుతుంది.

ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కూటమి హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కీలకమైనది. ఈ పథకంపై పరిశీలన జరపడానికి ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకు పంపించింది. అక్కడ అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేసి, సంబంధిత నివేదికను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.

అయితే, తెలంగాణ, కర్ణాటకలో అమలుచేస్తున్న విధానాన్ని ఏపీలో కూడా అమలు చేస్తే, ఏపీఎస్‌ఆర్టీసీపై నెలకు రూ.250 కోట్ల భారం పడే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటికీ, ఈ పథకం అమలులో వస్తున్న కీలక ప్రశ్నలు ఇవి? ముఖ్యంగా, ఉచిత ప్రయాణం ఎలాంటి సర్వీసులకు వర్తిస్తుందో, ఎన్ని రూట్లలో దీన్ని అమలు చేయాలో, అలాగే కొత్త జిల్లాల పరిధిలోనే ఈ పథకం పరిమితమవుతుందో లేక పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆవశ్యకత ఉంటుందో అనే అంశాలపై అధికారుల దృష్టి కేంద్రితమై ఉంది. ఏపీ రాష్ట్రంలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో, ఈ అన్ని సర్వీసులలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడానికి కొన్ని ప్రాక్టికల్‌ అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ పధకం అమలు అయితే ప్రభుత్వ బస్సుల్లో రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు, అదనంగా బస్సులు కొనుగోలు చేసి, డ్రైవర్‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అందుకే, ఈ పథకాన్ని అమలు చేయడానికి సరిపడా సౌకర్యాలు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అధికారుల అభిప్రాయం. ఈ నేపధ్యంలో, ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం, ఈ పథకాన్ని సంక్రాంతి తరువాత అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో, ఈ పథకం ప్రారంభానికి సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలు సంభవిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Free Bus In AP
  • Government Whip Gannavaram MLA
  • Yarlagadda Venkat Rao

Related News

    Latest News

    • రాత్రి నెయ్యితో పాలు తాగితే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!

    • తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పోటీ

    • ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేకుండా..ఎయిర్‌టెల్ ఆకర్షణీయమైన ఆఫర్‌

    • తారిఖ్‌ రహ్మాన్‌ చేతికి బీఎన్‌పీ పగ్గాలు

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..?: పరిష్కారాలు ఇవే..!

    Trending News

      • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

      • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

      • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

      • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

      • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd