4 Tiger Cubs: అవి పిల్లులు కాదు.. పులి పిల్లల్లు!
ఏపీలో నాలుగు పులి పిల్లల్లు గ్రామస్తుల కంటపడ్డాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.
- By Balu J Published Date - 04:03 PM, Mon - 6 March 23

పై ఫొటోను చూస్తే.. ఎవరికైనా పిల్లులేమో అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అచ్చం అలానే ఉన్నాయి. అయితే అవి పిల్లులు కావు.. కొద్దిరోజుల క్రితం పుట్టిన పులి పిల్లల్లు (Tiger Cubs). ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ఓ గ్రామ సమీపంలో స్థానికులకు నాలుగు పులి పిల్లలు (Tiger Cubs) కనిపించాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామస్థులు ఆదివారం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పిల్లలను గుర్తించారు.
కుక్కల బెడద భయంతో పిల్లలను గ్రామంలోని ఇంటికి తరలించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే పిల్లలను వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి పులి వస్తుందేమోనన్న భయం గ్రామస్తుల్లో నెలకొంది. ఈ గ్రామం ఆత్మకూర్ అటవీ డివిజన్ సమీపాన ఉంది. పులి పిల్లలను స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు (Forest Officers), పులి తన పిల్లలను వదిలి ఆహారం కోసం అడివికి వెళ్లి ఉండొచ్చునని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పులి పిల్లలు (Tiger Cubs) క్షేమంగానే ఉన్నాయి. కాగా మరోవైపు పులి జాడ కోసం అటవీ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Also Read: Amitabh Injured: ప్రాజెక్ట్ కే షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కు గాయాలు

Related News

TDP Mahanadu: రాజమండ్రిలో టీడీపీ మహానాడు
పార్టీలోకి 40 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి రానున్నారని మాట్లాడిన ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.