HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Four Reportedly Killed In Fire At Pharma Unit Near Vizag

Fire At Pharma Unit: ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురి సజీవదహనం

అనకాపల్లి జిల్లా పరవాడ (Parawada)లో ఉన్న జేఎన్‌ ఫార్మసీలోని ఓ ఫార్మాస్యూటికల్‌ యూనిట్‌లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి (Four persons died) చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాంబాబు, రాజేష్, రామకృష్ణ, వెంకట్రావుగా గుర్తించారు. మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.

  • Author : Gopi Date : 27-12-2022 - 6:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
4 killed In Fire
Fire

అనకాపల్లి జిల్లా పరవాడ (Parawada)లో ఉన్న జేఎన్‌ ఫార్మసీలోని ఓ ఫార్మాస్యూటికల్‌ యూనిట్‌లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి (Four persons died) చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాంబాబు, రాజేష్, రామకృష్ణ, వెంకట్రావుగా గుర్తించారు. మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లారస్ యూనిట్ 3లో షార్ట్ సర్క్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

పరవాడ పోలీసుల ప్రకారం.. యూనిట్ లారస్ ల్యాబ్స్‌గా గుర్తించబడింది. ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు ధృవీకరించని నివేదికలు అందాయి. వారి మృతదేహాలు కింగ్ జార్జ్ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నాయి. షీలానగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కంపెనీ అధికారుల నుంచి పోలీసులకు ఇంకా అధికారిక సమాచారం రాలేదన్నారు. కాగా.. సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు ఫార్మాసిటీ కార్మికులు, సీఐటీయూ నాయకుడు సత్యనారాయణ ధ్రువీకరించారు. యూనిట్‌లో భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. గడిచిన ఏడాది కాలంగా పరవాడ ఫార్మా సిటీలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. తమకు రక్షణ లేకుండా పోయిందని కార్మికులు వాపోతున్నారు. పరిశ్రమల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఫార్మా సిటీలో ఇలాంటి ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయని కార్మికులు ఆరోపించారు.

Also Read: Vizag kapu : కాపునాడుకు వైసీపీ డుమ్మా, 5శాతం రిజ‌ర్వేజ‌న్ పై జ‌గ‌డం

పవన్ దిగ్భ్రాంతి

అనకాపల్లిలోని పరవాడ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంపై జనసేనాని పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫార్మా సంస్థలో చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించడం దురదృష్టకరమన్నారు. ఆ కుటుంబాలకు న్యాయబద్ధమైన ఆర్థికపరిహారం ఇవ్వాలని, అన్నివిధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. క్షతగాత్రులైన వారికి మెరుగైన వైద్యసాయం అందించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anakapalli
  • andhra pradesh
  • Four persons died
  • JN Pharmacity at Parawada
  • Parawada

Related News

Apollo Hospitals' Dr. Preetha Reddy Meets CM Chandrababu

Cm Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ డాక్టర్ ప్రీతారెడ్డి భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆమె చంద్రబాబు నాయకత్వం, దార్శనికతపై ప్రశంసలు కురిపించారు. సమ్మిళిత అభివృద్ధి, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి పట్ల సీఎంకు ఉన్న అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు ప్రీతారెడ్డి తెలిపారు

  • Religious Organizations Brought Under the Ambit of the RTI Act

    Andhra Pradesh: ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..

  • Thalliki Vandanam

    Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్‌డేట్..

  • Fight in the Middle of the Road Over a Girl

    Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

  • Another massive investment in AP.

    AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

Latest News

  • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

  • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

  • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

  • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Trending News

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd