HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Four Ias Who Were Relieved From Telangana Reported In Ap

IAS officers : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు..త్వరలో పోస్టింగ్‌లు..!

IAS officers : అయితే తెలంగాణ ప్రభుత్వం .. వారిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తీర్పు వచ్చే వరకూ రిలీవ్ చేయలేదు. కోర్టు వారి పిటిషన్ కొట్టి వేసిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. రిలీవ్ చేయడానికి పది, పదిహేను రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా సానుకూల నిర్ణయం రాలేదు.

  • Author : Latha Suma Date : 17-10-2024 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Four-IAS-Who-Were-Relieved-From-Telangana-Reported-In-Ap
Four-IAS-Who-Were-Relieved-From-Telangana-Reported-In-Ap

Reported in AP : తెలంగాణలోనే కొనసాగేందుకు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో తెలంగాణలో రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్టు చేశారు. ఏపీ సచివాలయానికి వచ్చిన వారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు తమ జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. త్వరలోనే వారికి పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉంది. కాట అమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, వాకాటి అరుణ ఏపీలో రిపోర్టు చేశారు. వాస్తవానికి వీరంతా పదహారో తేదీనే ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. ఆ తేదీనే ఫైనల్ చేస్తూ.. డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది.

అయితే తెలంగాణ ప్రభుత్వం .. వారిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తీర్పు వచ్చే వరకూ రిలీవ్ చేయలేదు. కోర్టు వారి పిటిషన్ కొట్టి వేసిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. రిలీవ్ చేయడానికి పది, పదిహేను రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా సానుకూల నిర్ణయం రాలేదు. డీవోపీటీ ఉత్తర్వుల విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది. దీంతో వారు ఏపీలో రిపోర్టు చేయక తప్పలేదు. మరో వైపు ఏపీ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు డీవోపీటీ ఉత్తర్వుల మేరకు తెలంగాణలో బుధవారమే రిపోర్టు చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత క్యాడర్ విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఐఏఎస్‌లకు విభజించింది. తెలంగాణ క్యాడర్ కేటాయించిన కొంత మంది.. ఏపీ కేడర్ కేటాయించిన కొంత మంది ఈ కేటాయింపు సరి కాదని క్యాట్ లో పిటిషన్లు వేయడంతో పాటు న్యాయపోరాటం చేశారు. పదేళ్ల పాటు వారు కోరుకున్న రాష్ట్ర క్యాడర్ లోనే కొనసాగారు. కానీ ఇప్పుడు తుది నిర్ణయం రావడంతో వెనక్కి వెళ్లక తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగితే కీలక పోస్టింగులు ఉంటాయని ఇప్పుడు ఏపీకి వెళ్తే పెద్దగా పట్టించుకోరన్న అభిప్రాయంతో ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగాలని అనుకున్నట్లగా తెలుస్తోంది.

తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారులు అంజనీకమార్, అభిలాష్ బిస్త్ కూడా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. వారు ఇంకా రిపోర్టు చేయలేదు. డీవోపీటీ నుంచి వారికి ఇంకా ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. ఆదేశాలు వచ్చిన తర్వాత వారు కూడా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. అంజనీకుమార్ గత ఎన్నికలకు ముందు వరకూ తెలంగాణలో డీజీపీగా పని చేశారు.

Read Also: Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం..అందరికీ ఉపాధి..మా ప్రభుత్వ ఆలోచన: సీఎం రేవంత్ రెడ్డి

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • CS Nirab Kumar Prasad
  • IAS Officers
  • postings
  • reported
  • telangana

Related News

Komatireddy

Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

మంత్రి కోమ‌టిరెడ్డి వెంట‌క‌రెడ్డి మ‌రోసారి త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక, ఉన్నత విద్య కోసం అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతురాలైన విద్యార్థిని భవితకు ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని భవిత పదో తరగతిలో 600 మార్కులకు గాను 582 మార్కులు సాధి

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd