TDP Joinings: విజయసాయిరెడ్డికి బిగ్ షాక్, టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గడికోట!
- Author : Balu J
Date : 03-01-2024 - 5:08 IST
Published By : Hashtagu Telugu Desk
TDP Joinings: ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం తెదేపాలో చేరారు. ఇతర కుటుంబసభ్యులు చంద్రబాబు సమక్షంలో TDP గూటికి చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. 1994లో టిడిపి నుంచి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కాగా, పలు మండలాలు రాయచోటిలో విలీనమయ్యాయి.
కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ రెడ్డి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ద్వారకానాథరెడ్డితో పాటు ఆయన సోదరుడు సురేంద్రనాథరెడ్డి, అక్క హెరెమ్మలు టీడీపీలో చేరారు.
కాగా ద్వారకానాథరెడ్డి తండ్రి రామసుబ్బారెడ్డి 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 నుంచి ఈయన కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది. ద్వారకానాథరెడ్డి 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పాటుగా రాజకీయ పరిణామాలు మారడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఆయన చేరికతో టీడీపీ బలం చేకూరినట్టయింది.