Chevireddy : ఒకఆడబిడ్డ తండ్రి ఆవేదన..నీచ రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే
Chevireddy : ఎమ్మెల్యే పులివర్తి నాని గారు హాస్పిటల్ దగ్గరికి చేరుకొని తప్పు చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు
- By Sudheer Published Date - 02:24 PM, Tue - 5 November 24

ఎర్ర వారి పాలెం (Yerravaripalem) మండలం, ఎల్లమంద (Yellamanda) పంచాయతీలో నిన్నటి రోజున ఒక అమ్మాయి స్కూలుకు వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు ఆకతాయిలు కొట్టి పారిపోయారు. అమ్మాయి, స్పృహ తప్పి పడిపోవడంతో సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలని తిరుపతి ప్రభుత్వ హాస్పిటల్ కి చేర్పించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని గారు హాస్పిటల్ దగ్గరికి చేరుకొని తప్పు చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో డాక్టర్లను మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే నాని (MLA Nani) గారు ఆదేశించడం జరిగింది.
మాజీ ఎమ్మెల్యే చెవి రెడ్డి (Ex MLA Chevireddy Bhaskar Reddy) గారు ఇదే అదునుగా చూసుకొని నీచ రాజకీయం చేస్తున్నారు అత్యాచారం జరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ కాకముందే, కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే మీడియాలో తనకు నచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. పాప తండ్రి మాట్లాడుతూ తమ బిడ్డ భవిష్యత్తు నాశనం చేస్తున్నారని తమకు రాజకీయాలతో పనిలేదని మా బిడ్డకు న్యాయం జరగాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉందని తెలిపారు. రాజకీయాలతో మాబిడ్డ భవిష్యత్తు నాశనం చేయవద్దని అమ్మాయి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : Supreme Court : యూపీ మదార్స పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..17 లక్షల మంది విద్యార్థులకు ఊరట