Seediri Appalaraju: అధికార గర్వం చూపించబోయి..అడ్డంగా బుక్కైన మాజీ మంత్రి కొడుకు
- Author : Vamsi Chowdary Korata
Date : 18-07-2026 - 2:35 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు చిక్కుకున్న ‘హిట్ అండ్ రన్’ కేసులో పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసు విచారణలో మొదటి నుంచి అలసత్వం వహించడంతో పాటు, నిందితులకు కొమ్ముకాస్తూ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు అధికారులపై వేటు పడింది.
ఈ కేసుకు సంబంధించి కాశీబుగ్గ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రామకృష్ణను ఉన్నతాధికారులు తక్షణమే వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ ఎస్సై సునీల్‌ను ఇప్పటికే వీఆర్‌కు పంపించిన సంగతి తెలిసిందే.
శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ రోడ్డు ప్రమాద ఘటనలో… బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులను రక్షించేందుకు కాశీబుగ్గ పోలీసులు తెరవెనుక చక్రం తిప్పారనే విమర్శలు వెల్లువెత్తాయి. కేసును పక్కదారి పట్టించేందుకు వారు వ్యవహరించిన తీరుపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు, ప్రాథమిక ఆధారాల బేసిస్‌పై సీఐ, ఎస్‌ఐ ఇద్దరినీ లూప్‌లైన్‌కు పంపించడం పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.