HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Former Minister Of Ap Who Made Sensational Comments On His Death

Death Day Celebration :`డెత్ డే`పై మాజీ మంత్రి సంచ‌ల‌న ఆహ్వానం

నా మరణదిన వేడుకలు (Death Day Celebration) ఘనంగా చేసుకుంటున్నా, మీరు తప్పకుండా రావాలని ఆహ్వాన

  • Author : Maheswara Rao Nadella Date : 17-12-2022 - 1:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Death Day Celebration
Ap Death

వివాహానికో, గృహ ప్రవేశానికో లేక పుట్టిన రోజు వేడుకలనో.. శుభకార్యాలకు ఆహ్వాన పత్రికను ముద్రించి బంధుమిత్రులకు పంపించడం సాధారణమే! కానీ నా మరణదిన వేడుకలు (Death Day Celebration) ఘనంగా చేసుకుంటున్నా, మీరు తప్పకుండా రావాలని ఆహ్వాన పత్రిక అందుకుంటే ఎలా ఉంటుంది? ఇదేం ఆహ్వానం అనిపించకమానదు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ రాజకీయ నాయకుడి అనుచరులు, అభిమానులు కూడా ఇప్పుడు అలాగే ఫీలవుతున్నారు. తమ అభిమాన నాయకుడు మరణదిన వేడుకలకు (Death Day Celebration) రమ్మంటూ ఆహ్వాన లేఖ పంపడమే దీనికి కారణం. చీరాల ఐఎంఏ హాల్ లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే వేడుకలకు హాజరవ్వాలని పాలేటి రామారావు అభిమానులను కోరారు. ఏపీ మాజీ మంత్రి పాలేటి రామారావు పంపిన ఆ లేఖలో ఏముందంటే.. ‘ఏటా జరుపుకునే పుట్టినరోజు వేడుకలు అర్థరహితమని తెలుసుకున్నా.. అందుకే ఇకపై మరణదిన వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నా. ఇన్నాళ్ల నా జీవితాన్ని పరిశీలించుకున్నాక నా మరణ సంవత్సరాన్ని 2034 గా నిర్ణయించుకున్నా.

దానికి ఇంకా 12 సంవత్సరాలు ఉంది. ఇప్పటి నుంచి ప్రతీ సంవత్సరం మరణదిన వేడుకలు జరుపుకుంటాను. ఆ వేడుకలకు మీరు హాజరై, నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అంటూ రామారావు ఆ లేఖలో పేర్కొన్నారు. మాజీ మంత్రి పంపిన ఈ లేఖ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. పుట్టిన ప్రతీ ఒక్కరికీ మరణం తప్పదని, బతికి ఉన్నంత కాలం ఇతరులకు వీలైనంత సాయం చేయాలే తప్ప అపకారం చేయొద్దని రామారావు చెప్పారు. ఈ విషయం గుర్తెరిగి తాను ఎంతకాలం జీవించాలని అనుకుంటున్నాడో ఆలోచించి, మరణానికి ఓ తేదీని నిర్ణయించుకుని ఏటా మరణదిన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. భగవంతుడు ఎంత బోధించినా మనిషి తన జీవన విధానాన్ని, ఆలోచనను పూర్తిగా సరిచేసుకోవడంలేదని అన్నారు.

Also Read:  Hyderabad MMTS : ఔటర్‌ చుట్టూ ఎంఎంటీఎస్‌ లో రూ.40 లతో ప్రయాణం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • Death Day Celebration
  • death sentence
  • Former MLA
  • trending
  • viral

Related News

Massive arrangements for Sankranti rush.. Special trains between Cherlapalli-Anakapalli

సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి మధ్య మూడు కొత్త ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

  • Bhogi Mantalu

    భోగి మంటలు విషయంలో జాగ్రత్తలు అవసరం !

  • 2026 Central Budget

    కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలన్నీ, మరి న్యాయం జరిగేనా?

  • Sajjala

    రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • పల్లీలతో స్నాక్స్ ఆరోగ్యానికి మేలా? నష్టమా?.. నిపుణుల సూచనలు ఇవే..!

  • అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’..ఎప్పటినుంచంటే?

  • ఐసిస్‌పై అమెరికా మెరుపు దాడులు: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

  • మూత్రపిండాల ప్రాధాన్యత ఏమిటి?..సమస్యలను సూచించే ముందస్తు లక్షణాలివే..!

  • స్త్రీలు గాజులు ధరిస్తున్నారా? ..మరి ఈ నియమాలు తెలుసా?

Trending News

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd