HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Former Minister Kodali Nani Shift To Mumbai Hospital Due To Health Issues

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్యంపై కీల‌క అప్డేట్‌.. ముంబైకి త‌ర‌లింపు!

ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కి తరలించే అవకాశం ఉంది. కొడాలికి గుండెలో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాల‌ని వైద్యులు సూచించారు.

  • Author : Gopi Date : 31-03-2025 - 11:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kodali Nani
Kodali Nani

Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (Kodali Nani) ఆరోగ్య పరిస్థితి గురించి కీల‌క అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న‌ను మెరుగైన వైద్యం కోసం ముంబై త‌ర‌లించనున్న‌ట్లు తెలుస్తోంది. కొడాలి నాని మార్చి 25న ఛాతీ నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG) ఆస్పత్రిలో చేరారు. ప్రారంభంలో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు పుకార్లు వచ్చినప్పటికీ ఆస్పత్రి వైద్యులు ఆయన పరిస్థితిని గ్యాస్ట్రిక్ సమస్యగా నిర్ధారించారు. అయితే గుండె సంబంధిత సమస్యలను కూడా ప‌రీక్షించారు. మార్చి 26, 2025 నాటికి ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

మార్చి 27, 2025న వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా కొడాలి నానిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏఐజీ వైద్యులు ఆయనకు గుండె సంబంధిత అసాధారణతలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా గుండెపోటు అని నిర్ధారించలేదు. కొన్ని వార్తా సంస్థలు సర్జరీ అవసరం కావచ్చని పేర్కొన్నప్పటికీ, ఈ విషయంలో అప్ప‌టికి స్పష్టత రాలేదు.

Also Read: Important Festivals: కొత్త ఏడాది ఉగాది నుంచి ముఖ్య‌మైన పండ‌గ‌లు ఇవీ!

తాజా నివేదికల ప్రకారం.. కొడాలి నాని ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు ఆశిస్తున్నారు. ఆస్పత్రి లేదా కుటుంబం నుండి మరిన్ని అధికారిక నవీకరణలు రావాల్సి ఉంది.

కొడాలి నానిని ముంబైకి తరలించే అవకాశం

వైసీపీ కీల‌క నేత‌, మాజీ మంత్రి కొడాలి నానికి హార్ట్ స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం ముంబై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కి తరలించే అవకాశం ఉంది. కొడాలికి గుండెలో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాల‌ని వైద్యులు సూచించారు. మెరుగైన చికిత్స కోసం.. హార్ట్ స్పెషల్ హాస్పిటల్ అయిన ముంబై బాంద్రాలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సర్జరీ చేయించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Former Minister Kodali Nani
  • health issues
  • health updates
  • mumbai hospital
  • ycp leader
  • ysrcp

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Ys Sharmila

    YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

  • Sai Vaishnavi Nellore

    Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd