HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Fight In The Middle Of The Road Over A Girl

Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

  • Author : Vamsi Chowdary Korata Date : 22-05-2026 - 11:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fight in the Middle of the Road Over a Girl
Fight in the Middle of the Road Over a Girl

విజయవాడలో గురువారం రాత్రి సినిమా రేంజ్ సీన్లు కనిపించాయి. ఇద్దరు యువకులు థార్ జీపులతో బీభత్సం సృష్టించారు. ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. చివరికి థార్ జీపులతో ఢీకొట్టుకున్నారు. ఆ తర్వాత రాడ్లతో జీపులను ధ్వంసం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు… ఒకరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

విజయవాడలో ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. మొన్నటి వరకు స్నేహితులుగా ఉన్న ఇద్దరికి ఓ అమ్మాయి విషయంలో గొడవ మొదలైంది. వారిద్దరి మధ్య ఈ వివాదం మరింత ముదిరింది. చివరికి ఇద్దరు స్నేహితులు నడిరోడ్డుపై కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్లారు. ఇద్దరు థార్ కార్లతో రోడ్డుపై హంగామా చేశారు. ఇద్దరు రెండు కార్లతో ఢీకొట్టుకున్నారు. రెండు కార్లు ధ్వంసమైనా సరే వెనక్కు తగ్గలేదు. ఆ తర్వాత ఇద్దరు బ్యాట్లతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనతో జనాలు భయపడ్డారు. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ హైటెన్షన్‌ రోడ్డులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

విజయవాడ తాడిగడప ప్రాంతానికి చెందిన లింగమనేని రోహిత్, విజయవాడ భారతీ నగర్కు చెందిన బొల్లా ఓమ్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. రోహిత్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఓమ్ తండ్రితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఓ యువతి విషయంలో వివాదం మొదలైంది. ఓమ్ రోహిత్కు ఫోన్ చేసి ఎక్కడున్నావని ఆరా తీశాడు. అలా మెల్లగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తాను పటమట ఆర్ఆర్ గార్డెన్ హైటెన్షన్ రోడ్డులో ఉన్నానని రోహిత్ చెప్పాడు. ఇద్దరి మధ్య సవాళ్లు కూడా నడిచాయి.

గురువారం రాత్రి ఓమ్ తన థార్ జీప్ తీసుకుని హైటెన్షన్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడ రోహిత్ థార్ జీప్ను ఢీకొట్టాడు. ఇద్దరూ జీప్లను ఒకదానికొకటి ఢీకొట్టుకున్నారు. రెండు థార్ జీప్లు అలా రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలియక జనాలు కంగారుపడ్డారు. ఆ రోడ్డులో వాకింగ్ చేస్తున్న వారితో పాటు స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత ఇద్దరూ రాడ్లతో జీప్ల అద్దాలను కూడా పగులగొట్టుకున్నారు. కొంతమంది స్థానికులు ఈ గొడవ గురించి ఆ పక్కనే ఉన్న పటమట పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి రావడంతో రోహిత్ తన జీప్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. పోలీసులు ఓమ్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి ప్రశ్నించారు. ఈ గొడవ జరిగిన సమయంలో ఓ యువతి కూడా అక్కడే ఓ జీప్లో ఉంది. మరికొందరు యువకులు మరో జీప్లో ఉన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • girl
  • Thar Jeep
  • vijayawada

Related News

Another massive investment in AP.

AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు, కంపెనీలు క్యూ కట్టాయి. మిట్టల్ స్టీల్, గూగుల్ డేటా సెంటర్, యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు సహా ఎన్నో పెట్టుబడులు వచ్చాయి. వీటితో పాటుగా ఏపీకి బీపీసీఎల్‌ (భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్) పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ కూడా ఏర్పాటు కాబోతోంది. నెల్లూరు జిల్లా రామా

  • AP Caste Census Report These Are the Castes with the Highest Population!

    AP Caste Census: ఏపీలో కులగణన రిపోర్ట్.. అత్యధిక జనాభా ఉన్న కులాలివే!

  • Chandrababu

    CM Chandrababu: మత్స్యకారులకు అండగా : సీఎం చంద్రబాబు

  • AP ICET-2026 Results Released

    AP ICET Results: ఏపీ ఐసెట్‌-2026 ఫలితాలు విడుదల

  • CM Chandrababu launches 'Operation Clean Sweep'.

    Cm Chandrababu: ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

Latest News

  • Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

  • Prakash Raj: కాక్‌రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!

  • Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు

  • APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

  • APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Trending News

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd