HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Father Murders His Own Daughter For His Lover

Markapuram: ప్రియురాలి కోసం కన్న కూతురిని హతమార్చిన తండ్రి

  • Author : Vamsi Chowdary Korata Date : 27-03-2026 - 12:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Father Kills Daughters Markapuram
Father Kills Daughters Markapuram

Father Kills Daughters మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ఒక అమానుష ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిని తండ్రి తన ప్రియురాలితో కలిసి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే హత్య చేసినట్లు చెబుతున్నారు. బాలిక కనిపించకపోవడంతో వెతకగా.. ఇంటి పక్కన ఉండే ఓ మహిళ ఇంట్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మార్కాపురం జిల్లాలో దారుణం జరిగింది. కన్న కూతుర్ని తండ్రి ప్రియురాలితో కలిసి హత్య చేశాడు. త్రిపురాంతకానికి చెందిన ఎం. శివారెడ్డి, భార్య ఈశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె తులసికి 9 ఏళ్లు. ఈ నెల 25న రాత్రి శివారెడ్డి, ఈశ్వరమ్మ డాబాపై నిద్రించారు. తులసి తన తాతయ్య సుందరయ్య దగ్గర నిద్రించింది. తెల్లవారుజామున తాతయ్య బయటకు వెళ్లారు. ఆయన మళ్లీ వచ్చి చూసేసరికి మంచం మీద తులసి కనిపించలేదు. చిన్నారి కోసం ఇంట్లో వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చుట్టుపక్కల కూడా వెతికారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు కూడా పాప కోసం గాలించారు. ఈ క్రమంలో బాలిక తండ్రి శివారెడ్డికి ఇంటి పక్కన ఉండే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. అప్పుడు మహిళ ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చింది. వెంటనే తాళం పగులగొట్టి చూడగా చిన్నారి విగతజీవిగా పడి ఉంది. తులసి నోట్లో వస్త్రాలు, మొహం, గొంతుపై గాయాలు ఉన్నాయి. ఒంగోలు నుంచి క్లూస్ టీమ్‌ను, గుంటూరు నుంచి ఫోరెన్సిక్ టీమ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. తన భర్త శివారెడ్డి, ఇంటి పక్కన ఉండే బాజీబీ అనే మహిళతో కలిసి తన కుమార్తెను చంపినట్లు బాలిక తల్లి ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివారెడ్డి, బాజీబీలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తులసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే తులసిని తండ్రి శివారెడ్డి ప్రియురాలితో కలిసి చంపినట్లు తెలుస్తోంది.

సత్యవేడులో చిన్నారిని చంపేసిన తల్లి

మరోవైపు తిరుపతి జిల్లా సత్యవేడులో దారుణం జరిగింది. ఆరు నెలల చిన్నారిని తల్లి చంపేసింది. తమిళనాడుకు చెందిన వెంకటేష్, హేమవతి దంపతులకు ఐదేళ్ల కుమారుడు, ఆరు నెలల పాప ఉన్నారు. వెంకటేష్ కోమటిగుంటలో ఇటుకల తయారీ పనుల కోసం

ఏడు నెలల కిందట ఎన్‌ఆర్‌ అగ్రహారం వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. భార్య హేమవతి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉదయం పాప ఆకలితో ఏడ్చింది. వెంకటేష్ హేమవతిని పాలు ఇవ్వమని చెప్పి పనికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత భర్తకు ఫోన్ చేసి పాప ఆకలితో ఏడుస్తుంటే చంపేశానని చెప్పింది. వెంకటేష్ ఇంటికి వచ్చి చూసేసరికి పాప విగతజీవిగా కనిపించింది. వెంకటేష్ సత్యవేడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, హేమవతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Father Kills Daughters
  • Markapuram new District
  • Tripuranthakam

Related News

The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున

    Latest News

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

    • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd