YCP : బెజవాడలో వైసీపీకి షాక్.. త్వరలో జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగలబోతుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే
- Author : Prasad
Date : 30-10-2023 - 7:47 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగలబోతుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీని వీడనున్నారు. గత మూడేళ్లుగా వైసీపీలో యలమంచిలి రవి అసంతృప్తితో ఉన్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే జనసేన లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే పలుమార్లు అయిన అభిమానులు కార్యకర్తలతో సమావేశమయ్యారు అభిమానులు,కార్యకర్తలు జనసేన చేరాలని సూచించడంతో అయిన త్వరలోనే జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు విజయదశమి పర్వదినం రోజున యలమంచిలి రవి జనసేన లో చేరుతున్నట్లు అభిమానులకు సూచించారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ లో చేరిన యలమంచిలి రవికి జగన్ తూర్పు నియోజకవర్గ సీటు ఇస్తానని ఇవ్వకపోవడంతో ఆయన అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. 2019 ఎన్నికల తరువాత నుంచి యలమంచిలి రవి వైసీపీ కి దూరంగా ఉంటున్నారు 2019 ఎన్నికలో అయిన అభిమానులందరూ జనసేన కు మద్దతు తెలిపి అప్పటి అభ్యర్ధి బత్తిన రాముకు ఓట్లు వేశారు. దీంతో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఓటమి చెందింది. జనసేన లోని ముఖ్య నాయకులు ఎప్పటి నుంచో యలమంచిలి రవి తో టచ్ లో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ యలమంచిలి రవి జనసేన లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. యలమంచిలి రవి చేరికతో తూర్పు నియోజకవర్గం లో జనసేన పార్టీ బాగా బలపడుతుంది. 2009 లో కాంగ్రెస్ వేవ్‌లో కూడా యలమంచిలి రవి ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు.
Also Read: Train Accident : ఏపీలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు