HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ex Mla Dhulipalla Narendra Fires On Cm Jagan

TDP vs YSRCP : కసాయి ముఖ్యమంత్రికి రైతుల దుస్థితి క‌నిపించ‌దా..?

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర ఫైర్ అయ్యారు. ఈ సంవత్సరం రైతాంగం లక్షలాది

  • Author : Prasad Date : 02-11-2023 - 5:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర ఫైర్ అయ్యారు. ఈ సంవత్సరం రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు వేయకపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. రైతాంగం విషయంలో పాలకుల వైఖరి చాలా దారుణంగా ఉందని, డ్రాట్ మాన్యువల్ (కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు) ప్రకారం క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ కు సంబంధించి ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితి.. సాగునీరు.. విద్యుత్ .. వేసిన పంటలపై సమీక్ష చేయాలని.. కానీ జగన సర్కార్ మొత్తం వ్యవసాయ రంగాన్నే గాలికి వదిలేసిందని ఆయ‌న ఆరోపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు రైతుల్ని ఆదుకోవడానికి అనేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడమే మర్చిపోయిందని.. ఒక్కమాట చెప్పాలంటే వ్యవసాయశాఖ రాష్ట్రంలో చచ్చిపోయిందన్నారు. ముఖ్యమంత్రి అనే పదవిపై వ్యామోహం తప్ప.. ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి ఏం చేయాలో.. రైతుల విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా జగన్ రెడ్డికి తెలియదని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి తన శాఖకు సంబంధించిన నిజాలు బయటకు చెబితే.. తన తల వెయ్యి ముక్కలవుతుందేమో అన్నంతగా భయపడిపోతున్నార‌న్నారు. వ్యవసాయశాఖ మంత్రి అయితే మాట మాత్రంగా కూడా రైతుల గురించి స్పందించడం లేద‌ని.. అసలు ఆయన రాష్ట్రంలో ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితులుంటే.. ప్రభుత్వం మొక్కుబడిగా 103 మండలాలు ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు. ఆ 103 మండలాల్లో 80 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు చెబుతున్నా రని.. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా పడాల్సిన వర్షం…పడిన వర్షాన్ని లెక్కలోకి తీసుకోకుం డా ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడం బాధాకరమ‌న్నారు. జీవో నెం- 4ద్వారా కరువు మండలాలు ప్రకటించడం తప్ప.. రైతులకోసం.. కరువు పరిస్థితుల నివారణ కోసం ప్రభుత్వం పైసా కూడా నిధులు ఇవ్వలేదన్నారు. జీవో- 4 నాలుక గీసుకో వడానికి తప్ప దేనికి పనికిరాదని.. డ్రాట్ మాన్యువల్ ప్రకారం కరువు మండలాల ప్రకటన అనేది అక్టోబర్ 30 లోపు జరగాలని కేంద్రప్రభుత్వ నిబంధనలు చెబుతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం నింపాదిగా 31 అక్టోబర్ న ప్రకటించింద‌న్నారు. టీడీపీ-జనసేన నేతలు రైతుల్ని కలిసి వారి కష్టాలు, బాధలు తెలుసుకొని ప్రభుత్వం కళ్లు తెరిపిస్తారన్నారు. రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడి నేత్రత్వంలో టీడీపీ రైతు విభాగం సమావే శమైంది. ఆ సమావేశంలో కరువు మండలాల్లో టీడీపీ రైతు విభాగం పర్యటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. రైతుల్ని కలిసి.. వారి బాధలు కష్టాలు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యాచరణతో టీడీపీ ముందుకెళ్తుందని ధూళిపాళ్ల న‌రేంద్ర తెలిపారు. ఈ ప్రక్రియలో జనసేన ను కూడా కలుపుకొని తెలుగుదేశం ముందుకెళుతుంద‌ని తెలిపారు.

Also Read:  AP : క‌న్నీరు పెడుతున్న మిర్చి రైతులు.. గుంటూరులో వంద‌ల ఎక‌రాల్లో ఎండిపోయిన పంట‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • cm jagan
  • Dhulipalla Narendra
  • tdp
  • ycp
  • ysrcp

Related News

Minister Narayana inspected the MLA and MLC buildings in Amaravati.

AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. నిర్ణీత గడువులోగా భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా, రాజధాని ప్రాంతంలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనాలు దాదాపుగా పూర్తికావొచ్చాయని మంత్రి వెల్లడించారు. మరో వారం రోజుల్లో ఎమ్మెల్యే భవనాలను, మరో 20 రోజుల్లో ఎమ్మెల్

  • Key Meeting with Union Minister C.R. Patil Chandrababu

    Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • IT Minister Nara Lokesh Receives Grand Welcome At Singapore

    Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

  • CM Chandrababu Naidu

    CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

Latest News

  • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

  • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

  • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

  • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

  • NEET Paper Leak: నీట్ పేపర్ లీక్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd