Peddireddy Ramachandra Reddy : తిరుపతి నడిబొడ్డున మాజీ మంత్రి కబ్జా ?!
ఇప్పుడు పెద్దిరెడ్డి(Peddireddy) కబ్జాలో ఉన్న మూడు ఎకరాల బుగ్గమఠం భూములను స్వాధీనం చేసుకునేందుకు గతంలో దేవాదాయ, రెవెన్యూశాఖల అధికారులు ప్రయత్నించారు.
- Author : Pasha
Date : 21-02-2025 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
Peddireddy Ramachandra Reddy : మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అగ్రనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాలపై మరో సంచలన కథనం మీడియాలో ప్రచురితమైంది. ఆయన తిరుపతి నడిబొడ్డున మూడు ఎకరాల బుగ్గమఠం భూములను ఆక్రమించి, దాని చుట్టూ ప్రహరీని నిర్మించారని కథనంలో పేర్కొన్నారు. కబ్జాకు గురైన ఈ భూమి విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందట. ఆక్రమించిన బుగ్గమఠం భూముల్లో వైఎస్సార్ సీపీ ఆఫీసు, గోశాలను నిర్మించినట్లు ప్రస్తావించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ నిర్వాకం జరిగిందని కథనంలో తెలిపారు.
Also Read :Sonia Gandhi: ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
విజిలెన్స్ నివేదిక
ఇప్పుడు పెద్దిరెడ్డి(Peddireddy Ramachandra Reddy) కబ్జాలో ఉన్న మూడు ఎకరాల బుగ్గమఠం భూములను స్వాధీనం చేసుకునేందుకు గతంలో దేవాదాయ, రెవెన్యూశాఖల అధికారులు ప్రయత్నించారు. అయినా అది వీలుపడలేదు. అయితే వైఎస్సార్ సీపీ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అతిసులభంగా కబ్జా చేశారని కథనంలో పేర్కొన్నారు. ఈమేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏపీలోని కూటమి ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక ఇచ్చింది. పెద్దిరెడ్డి కబ్జాలో ఉన్న భూమిని సర్వే చేయించి, స్వాధీనం చేసుకొని అక్రమ నిర్మాణాల్ని తొలగించాలని సిఫారసు చేసింది.
Also Read :Birth Certificate: మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలా? తుది గడువు ఇదే!
4.20 ఎకరాల్లో పెద్దిరెడ్డి భవనం
తిరుపతిలో మారుతీనగర్, రాయల్‌నగర్ ఏరియాలు ఉన్నాయి. వాటిలోని బుగ్గమఠం భూముల్లో 4.20 ఎకరాల్లో పెద్దిరెడ్డి భవనం కట్టుకున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో తన ఇంటికి వెళ్లే మార్గంలో తిరుపతి నగరపాలక సంస్థ నిధులతో రోడ్డు వేయించుకున్నారు. తన ఇంటికి ఎదురుగా ఉన్న 3 ఎకరాల మఠం భూముల్ని ఆక్రమించారు. పట్టెం వెంకటరాయులుకి ఏడాదికి రూ.25కి లీజుకిచ్చినట్టు చెబుతున్న 7.10 ఎకరాల భూమి పెద్దిరెడ్డి ఇంటికి తూర్పు, ఉత్తరం వైపు ఉంది. దానిలో 3 ఎకరాల్ని పెద్దిరెడ్డి ఆక్రమించి, పార్టీ కార్యాలయం, గోశాల పెట్టారు.
Also Read :Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి తప్పిన పెను ప్రమాదం
బుగ్గమఠం భూముల చరిత్ర
తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయానికి దక్షిణం వైపు బుగ్గమఠం ఉంది. దీన్ని రామానంద సంప్రదాయాన్ని పాటించే ఉత్తరాది బైరాగులు నెలకొల్పారు. ఈ మఠానికి అప్పట్లో చంద్రగిరి రాజులు భూములు, ఆస్తులు దానంగా ఇచ్చారు. అడంగల్, రెవెన్యూ రికార్డులు, దేవాదాయశాఖ కార్యాలయంలోని రిజిస్టర్ల ప్రకారం ఆ మఠానికి 123.43 ఎకరాల భూములు ఉండేవి. ప్రస్తుతం 38 సెంట్ల స్థలం మాత్రమే బుగ్గమఠం అధీనంలో ఉంది. 14.19 ఎకరాలు.. లీజుదారులమని చెప్పుకుంటున్న ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. మిగతా భూమిని పలువురు ఆక్రమించుకుని నిర్మాణాలు చేసేశారు.