HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ex Cm Chandrababu Naidu Said The Central Budget Is Not Promising

Chandrababu: బడ్జెట్ పై ‘బాబు’ రియాక్షన్..!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదనీ, వేతన జీవులకు మొండిచేయి చూపించినట్టుగా ఉందని బాబు నాయుడు అన్నారు.

  • Author : Balu J Date : 01-02-2022 - 5:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదనీ, వేతన జీవులకు మొండిచేయి చూపించినట్టుగా ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నదులు అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామని, డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో సంస్కరణలు మంచి పరిణామమని బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో మరోసారి వైసీపీ విఫలమైందని, 28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారు అని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలకు సొంత ప్రయోజనాలపై తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలపై శ్రద్ద లేదని చంద్రబాబు అన్నారు.

పంటలకు మద్దతు ధర విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరమని, పేద వర్గాలు, కోవిడ్ తో దెబ్బతిన్న రంగాలకు ఎటువంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్ లో చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చెయ్యడం సరికాదని,  నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో వాటిని తగ్గించేందుకు ఎటువంటి చర్యలను ప్రకటించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. టీడీపీ హయాంలో కృష్ణా – గోదావ‌రి -పెన్నా నదుల అనుసంధానం పై ప్రణాళికలు కూడా సిద్దం చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా నదుల అనుసంధానంపై కేంద్రం ముందడుగు వెయ్యడాన్ని చంద్రబాబు స్వాగతించారు.

విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని చంద్రబాబు ఆహ్వానించారు. గతంలో దేశంలో మొట్టమొదటి సారిగా ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీని తెచ్చామన్నారు. డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ కరెన్సీ విషయంలో కేంద్ర ప్రతిపాదనలు మంచి నిర్ణయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • Chandra Babu Naidu
  • comments
  • union budget

Related News

Acham Naidu Vs Botsa Satyanarayana

బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్

Acham Naidu Vs Botsa Satyanarayana  వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురా

    Latest News

    • Ramzan : రంజాన్ సందర్బంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

    • ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

    • Gold Price : బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇదే మంచి ఛాన్స్.. !!

    • ధూమపాన ప్రియులకు షాక్..

    • ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd