Suicide : మాజీ హోమంత్రి సుచరిత నివాసంలో ఎస్కార్ట్ డ్రైవర్ ఆత్మహత్య
ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత నివాసంలో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. సుచరిత ఎస్కార్ట్
- By Prasad Published Date - 07:52 AM, Tue - 24 January 23

ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత నివాసంలో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. సుచరిత ఎస్కార్ట్ డ్రైవర్‌గా పని చేస్తున్నా చెన్నకేశవరెడ్డి మంత్రి నివాసంలోని కార్యాలయ గదిలో తోటి అధికారికి చెందిన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య వెనుక ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆరోగ్యం, ఆర్థిక సమస్యలే అతని ఆత్యహత్యకు కారణాలని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందగా, ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.