DSC Notification : 10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ – మంత్రి లోకేష్
DSC Notification : అధికారంలోకి వచ్చిన పది నెలల వ్యవధిలో 117 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేశామని ఆయన వెల్లడించారు
- Author : Sudheer
Date : 29-03-2025 - 4:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మరో ప్రయత్నంగా ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన పది నెలల వ్యవధిలో 117 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో రానుందని తెలిపారు. మరో పది రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగంగా ముగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
Bhatti Vikramarka Mallu: హిమాచల్ ప్రదేశ్ తో తెలంగాణ 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం
అంతేకాదు మే నెలలో “తల్లికి వందనం”, “అన్నదాత సుఖీభవ” పథకాలను అమలు చేయనున్నట్లు లోకేష్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు, మహిళలకు ప్రయోజనం కలిగేలా ఈ పథకాలను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిందని తెలిపారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు పాఠశాలల్లో బోధనా సౌకర్యాలను విస్తృతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఉపాధ్యాయ నియామకాల ద్వారా అధ్యాపన నాణ్యత పెంపొందించి, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు.