Diwali Holidays : ఏపీలో దీపావళి సెలవు తేదీలో మార్పు.. తెలంగాణలో..?
Diwali Holidays : ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి పండుగ సెలవును ఈ నెల 13కు మార్చారు.
- Author : Pasha
Date : 06-11-2023 - 4:11 IST
Published By : Hashtagu Telugu Desk
Diwali Holidays : ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి పండుగ సెలవును ఈ నెల 13కు మార్చారు. 13న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్ రెడ్డి జీఓ నంబర్ 2167 విడుదల చేశారు. గతంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం ఈ నెల 12న (ఆదివారం) దీపావళి సెలవు. అయితే సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో స్వల్ప మార్పులు చేశారు. ఈక్రమంలోనే నవంబర్ 13న (సోమవారం) ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రకటించారు. నవంబర్ 11న రెండో శనివారం, నవంబర్ 12న ఆదివారం కావడంతో ఒకేసారి పండుగకు మూడు సెలవులు వచ్చినట్లయింది.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలోనూ నవంబర్ 13న (సోమవారం) దీపావళి సెలవు కావాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ఆదివారమే దివాళీ హాలిడే అని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. దీపావళి పబ్లిక్ హాలిడే ఆదివారం వస్తుండటంతో.. నవంబర్ 13న సోమవారం దీపావళి సెలవును ప్రకటించాలని రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. దీనిపై ప్రస్తుతానికి కేసీఆర్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నవంబర్ 12 ఆదివారం సాధారణ సెలవు కిందకు(Diwali Holidays) వస్తుంది.
Also Read: Game Changer Song Leaked : ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్ చేసిన ఇద్దరు అరెస్ట్