HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Dhee Fame Pandu Master Involved In Horrific Road Accident

Dhee Pandu Master: ఢీ ఫేమ్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం

  • Author : Vamsi Chowdary Korata Date : 03-06-2026 - 10:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
'Dhee' Fame Pandu Master Involved in Horrific Road Accident
'Dhee' Fame Pandu Master Involved in Horrific Road Accident

‘ఢీ’ డ్యాన్స్ షో ఫేమ్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో పండు మాస్టర్‌ను కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌కు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఈవెంట్‌ పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ ఫేమ్ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ పండు మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం దగ్గర కారు వెనుక నిలబడి ఉన్న పండు మాస్టర్‌ను కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది . ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. పండు మాస్టర్ తన టీమ్‌తో కలిసి తగరపువసలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలలో డ్యాన్స్ ఈవెంట్ కోసం వచ్చారు. ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని పండు మాస్టర్ తన టీమ్‌తో కలిసి తిరిగి వస్తున్నారు.

మార్గ మధ్యలో పండు మాస్టర్ టీమ్‌లోని ఒక డ్యాన్సర్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో రోడ్డుపక్కన కారు ఆపారు. వెంటనే పండు మాస్టర్ కారులో నుంచి కిందకు దిగి రోడ్డుపై నిలబడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ ఆయన్ను ఢీకొట్టింది. అది ఎదురుగా ఉన్న కారును కూడా ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, తోటి టీమ్ సభ్యుల సాయంతో ఆయన్ను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.

ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోళ్ల వ్యాన్ డ్రైవర్ అతి వేగం కారణంగా ప్రమాదం జరిగిందా.. ఇతర కారణాలు ఉన్నాయా అనేది క్లారిటీ లేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు.. కారుతో పాటుగా ప్రమాదానికి కారణమైన కోళ్ల వ్యాన్‌ను పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. పండు మాస్టర్ ఢీ డ్యాన్ షోతో పాటుగా మరికొన్ని షోస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తన టీమ్‌తో కలిసి సొంతంగా కొన్ని డ్యాన్స్ షోస్ చేస్తున్నారు. మంగళవారం రోజు పండు మాస్టర్ తన టీమ్‌తో కలిసి విశాఖపట్నం తగరపువలసలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో డ్యాన్స్ ఈవెంట్‌కు వెళ్లారు.. తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhrapradesh news
  • Dhee Dance Show
  • Pandu Master
  • road accident
  • Visakhapatnam

Related News

Former minister's son lands in deep trouble after trying to flaunt his official clout.

Seediri Appalaraju: అధికార గర్వం చూపించబోయి..అడ్డంగా బుక్కైన మాజీ మంత్రి కొడుకు

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు చిక్కుకున్న ‘హిట్ అండ్ రన్’ కేసులో పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసు విచారణలో మొదటి నుంచి అలసత్వం వహించడంతో పాటు, నిందితులకు కొమ్ముకాస్తూ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఈ కేసుకు సంబంధించి కాశీబుగ్గ సర్కిల్

    Latest News

    • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

    • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

    • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

    • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

    • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd