HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Andhra Pradesh
  • ⁄Delhi Tour Ap Cm Jaganmohan Reddy Met Modi At The Parliament Speakers Office

Delhi Tour : మోడీతో జ‌గ‌న్ భేటీ `ప్ర‌త్యేక‌హోదా` కోస‌మ‌ట!

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో (Delhi Tour) మోడీతో భేటీ అయ్యారు.సుమారు 40 నిమిషాల

  • By CS Rao Published Date - 02:25 PM, Fri - 17 March 23
Delhi Tour : మోడీతో జ‌గ‌న్ భేటీ `ప్ర‌త్యేక‌హోదా` కోస‌మ‌ట!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో (Delhi Tour) ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయ‌న‌తో ముఖాముఖి(Jagan-modi)  మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి కొన్ని ప‌త్రాల‌ను అందిస్తూ ప్ర‌స్తావించారు. వాటిని అధికారికంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టీమ్ విడుద‌ల చేసింది. కానీ, 40 నిమిషాల పాటు వాళ్లిద్ద‌రి మ‌ధ్యా జ‌రిగిన సంభాష‌ణ పూర్తిగా రాజ‌కీయ, కేసుల గురించే ఉంటుంద‌ని ఎవ‌రైనా భావిస్తారు. ఎందుకంటే, హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిష‌న్ త్రోసిబుచ్చిన రోజే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. యాదృశ్చిక‌మా? వ్యూహాత్మ‌క‌మా ? అనేది ప‌క్క‌న పెడితే సాధారణంగా కేసులు గురించే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లి ఉంటార‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. అంతేకాదు, మోడీ భేటీ ముగిసిన త‌రువాత కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా ను మ‌ధ్యాహ్నాం 2.30 గంట‌ల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఆ మేర‌కు అపాయిట్మెంట్ ఫిక్స్ అయిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ (Delhi Tour)

అక‌స్మాత్తుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ(Delhi Tour) వెళ్లారు. అసెంబ్లీ జ‌రుగుతోన్న వేళ సాధారణంగా ఇలాంటి ప‌ర్య‌ట‌న పెట్టుకోరు. ఢిల్లీ నుంచి అత్య‌వ‌స‌ర పిలుపు వ‌స్తే మిన‌హా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను వ‌దిలేసి వెళ్ల‌రు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫిక్స్ చేసుకున్నారు. అంటే, బ‌డ్జెట్ స‌మావేశాలు ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న వెళ్లారు. అంటే, ఏదో సీరియ‌స్ అంశం ఉండాలి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సీరియ‌స్ గా ఉండేవి ప్ర‌స్తుతం ఏమీ లేవు. వ్య‌క్తిగ‌త అంశాల‌ను ప‌రిణ‌న‌లోకి తీసుకుంటే, వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో బ్ర‌ద‌ర్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అనివార్యం గా క‌నిపిస్తోంది. మ‌రొక‌టి ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ఏపీలోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఏపీలోని లిక్క‌ర్ బ్రాండ్లు, డిస్ట‌ల‌రీల వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే. సౌత్ గ్రూప్ హెడ్ గా క‌విత ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో చిక్కారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న గెలుపుకోసం స‌ర్వ‌శ‌క్తుల‌ను ధార‌పోసిన కేసీఆర్ కుమార్తె ఆమె. ఇప్పుడు ఆమెను ఈడీ అరెస్ట్ నుంచి కాపాడేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా లాబీయింగ్ (Jagan-modi)చేసే ప‌రిస్థితులు లేక‌పోలేద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని వినికిడి. ఏదేమైనా, ఆయ‌న ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ కేసుల వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇప్పుడు కూడా అందుకోస‌మే వెళ్లార‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారానికి తెలుగురాష్ట్రాల్లోని ప‌రిస్థితులు కూడా అలాగే ఉన్నాయి.

  మ‌ధ్యాహ్నాం 2.30 గంట‌ల‌కు అమిత్ షా, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భేటీ  

అధికారికంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కలిసి (Jagan-modi) ఇచ్చిన విన‌తి ప‌త్రంలోని అంశాలు మాత్రం ఇలా ఉన్నాయి. వాటిని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టీమ్ విడుద‌ల చేసింది.

* రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను.
* గతంలో నేను ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించింది. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
* 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ చేస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నిధులను వెంటనే విడుదలచేయాల్సిందిగా, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
* గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యంచేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

పోలవరం ప్రాజెక్టు విషయంలో

* పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేదిశగా ప్రాజెక్టు నిర్మాణాన్ని సాగిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయలో కేంద్రం ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్దికాలంలోనే ఇది వాస్తవరూపంలోకి వస్తుంది. ఫలితాలు ప్రజలకు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాను సొంతంగా సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను.
*పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. వెంటనే దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నారు.
*తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వారీగా నిబంధనలను సడలించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
*పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చు.
*పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను.
*తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను.

తెలంగాణ డిస్కంల బకాయిలు (Delhi Tour)

*జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, 56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్‌ ఇస్తోంది. దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలోఆంధ్రప్రదేశ్‌ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్‌ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని(Delhi Tour) కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వినియోగించని రేషన్‌ కోటాను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరుతున్నాను.

Also Read : Delhi Tour : కేసీఆర్ దూత‌గా జ‌గ‌న్?, ఢిల్లీకి ప‌యనం!

*రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
*రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతిజిల్లాకు సుమారుగా 18లక్షలమంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్‌ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాను. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయపడాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
* వైయస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజనచట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్‌ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీ ఎండీసీకి గనులు కేటాయించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.

Also Read : Jagan 3.0: ఉగాదికి జగన్ 3.0, ఎన్నికల మంత్రివర్గం ఇదే?

Telegram Channel

Tags  

  • BJP Modi
  • cm jaganmohan reddy
  • jagan delhi tour
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Modi Millet :ఆరోగ్య‌క‌ర ఆహారం మిల్లెట్స్:గ్లోబ‌ల్ స‌ద‌స్సులో మోడీ

Modi Millet :ఆరోగ్య‌క‌ర ఆహారం మిల్లెట్స్:గ్లోబ‌ల్ స‌ద‌స్సులో మోడీ

చిరు ధాన్యాల(Modi Millet) యుగం మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది. పండించే రైతుల‌ను(Farmers)

  • BJP : టాలీవుడ్ `క‌మ‌ల`గుబాళింపు,మోడీ-షా`మెగా`ఎత్తుగ‌డ‌

    BJP : టాలీవుడ్ `క‌మ‌ల`గుబాళింపు,మోడీ-షా`మెగా`ఎత్తుగ‌డ‌

  • MLC Result: సైకిల్ స్పీడ్‌, `ముంద‌స్తు` దిశ‌గా జ‌గ‌న్‌!

    MLC Result: సైకిల్ స్పీడ్‌, `ముంద‌స్తు` దిశ‌గా జ‌గ‌న్‌!

  • Delhi Tour : కేసీఆర్ దూత‌గా జ‌గ‌న్?, ఢిల్లీకి ప‌యనం!

    Delhi Tour : కేసీఆర్ దూత‌గా జ‌గ‌న్?, ఢిల్లీకి ప‌యనం!

  • Onion Battle : రైతుల ధీన‌గాధ‌!పాకిస్తాన్ లో రూ. 250లు,ఇండియాలో రూ. 1లు

    Onion Battle : రైతుల ధీన‌గాధ‌!పాకిస్తాన్ లో రూ. 250లు,ఇండియాలో రూ. 1లు

Latest News

  • Soaps: నోరూరించే సబ్బులను చూసారా మీరు!

  • Future Cricketer: ఈ బాలిక కాబోయే క్రికెటర్..! వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి!

  • Earthquake: గ్వాలియర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతగా నమోదు..!

  • Rahul Gandhi Disqualified: రాహుల్ పై అన‌ర్హ‌త వేటు

  • SeVVA: ‘సేవా’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రకటించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

Trending

    • Navjot Kaur: సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్.. ఇక మనం కలవలేమా అంటూ ఎమోషనల్ పోస్టు..!

    • Gulzarilal Nanda: సాటి లేరు మీకెవ్వరు..

    • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: