Delhi Tour : కేసీఆర్ దూతగా జగన్?, ఢిల్లీకి పయనం!
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కొలిక్కి వస్తోన్న వేళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఢిల్లీ (Delhi Tour) వెళుతున్నారు.
- By CS Rao Published Date - 02:11 PM, Thu - 16 March 23

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కొలిక్కి వస్తోన్న వేళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఢిల్లీ (Delhi Tour) వెళుతున్నారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు జగన్మోహన్ రెడ్డి(Jagan) బ్రదర్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. నాలుగోసారి బుధవారం విచారించిన సందర్భంగా అరెస్ట్ తప్పదని చాలా మంది భావించారు. ఆలోపుగా న్యాయపరమైన రక్షణ పొందాలని కూడా అవినాష్ ప్రయత్నించారు. తెలంగాణ హైకోర్టు కూడా సీబీఐ విచారణను అడ్డుకోలేమని తేల్చేసింది. ఇక ఆరెస్ట్ అనివార్యంగా కనిపిస్తోన్న వేళ జగన్మోహన్ రెడ్డి బుధవారం రాత్రికి ఢిల్లీ పయనం కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఢిల్లీ (Delhi Tour)
ప్రస్తుతం కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారం ఢిల్లీలో(Delhi Tour) సీరియస్ గా నడుస్తోంది. దాని మూలాలు ఏపీలోనూ ఉన్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవను సీబీఐ అరెస్ట్ చేసింది. ఏపీలో లిక్కర్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలోని పలువురితో ముడిపడి ఉందని టీడీపీ తొలి నుంచి ఆరోపిస్తోంది. ఆ క్రమంలో కవితను ఈడీ ఉచ్చు నుంచి తప్పించే ప్రయత్నం అన్ని విధాలుగా జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. చతుర్ముఖ వ్యూహంతో ఆయన ముందుకెళుతున్నారు. అయినప్పటికీ కవిత అరెస్ట్ తప్పదని బుధవారం ఢిల్లీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. విచారణకు కూడా ఈడీ ఎదుట కవిత హాజరు కాలేదు. సుప్రీం కోర్టులో విచారణకు సంబంధించిన పిటిషన్ పెండింగ్ లో ఉందని చెబుతూ డుమ్మా కొట్టారు. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan) ఢిల్లీ వెళ్లడం పలు సంకేతాలకు అవకాశం ఇస్తోంది.
జగన్మోహన్ రెడ్డిని దూతగా బీజేపీ పెద్దల వద్దకు..
ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్మోహన్ రెడ్డి(Jagan), కేసీఆర్ ఇద్దరూ ఇటీవల వరకు బీజేపీకి అండగా ఉన్నారు. పార్లమెంట్ బయట, లోపల ఎన్డీయేకు మద్ధతు ఇచ్చారు. ఒకానొక సమయంలో ఎన్డీయేలో మంత్రిగా కవిత అవుతారని కూడా ప్రచారం జరిగింది. అదే సమయంలో వైసీపీ కూడా ఎన్డీయే మంత్రి వర్గంలో చేరుతుందని విస్తృతంగా టాక్ నడిచిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ బంధం ఇప్పటికీ బీజేపీ ఢిల్లీ పెద్దలతో(Delhi Tour) జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం ముచ్చింతల్ రామానుజాచార్యుల విగ్రహం ప్రతిష్ట సందర్భంగా పొడచూపిన ప్రొటోకాల్ వ్యవహారం నుంచి మోడీకి దూరం జరిగారు. విడతలవారీగా మోడీని టార్గెట్ చేస్తూ పావులు కదిపారు. అదే సమయంలో కవిత ఢిల్లీ లిక్కర్ కేసు తెరమీదకు వచ్చింది. పలు కోణాల నుంచి లాబీయింగ్ చేస్తున్నప్పటికీ కవితను ఈడీ నుంచి తప్పించలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారని ప్రగతిభవన్ వర్గాల్లోని టాక్. అందుకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దూతగా(Delhi Tour) ఢిల్లీ బీజేపీ పెద్దల వద్దకు పంపుతున్నారని రాజకీయ వర్గాల్లో వినికిడి.
Also Read : ED Kavitha : ఢిల్లీలో హైడ్రామా, విచారణ,అరెస్ట్ పై ఉత్కంఠ
ఒక వైపు బ్రదర్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందని ఆందోళన జగన్మోహన్ రెడ్డిని(Jagan) వెంటాడుతోంది. ఇప్పటికే నాలుగేళ్లు అయినప్పటికీ వివేకానందరెడ్డి హత్య వెనుక రహస్యం తేలలేదు. ఎప్పటికప్పుడు బాబాయ్ హత్యను ఢిల్లీ బీజేపీ పెద్దల ఆశీస్సులతో(Delhi Tour) పక్కదోవ పట్టిస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం అవినాష్ రెడ్డి ఆ హత్యను చేయించారని సీబీఐ ఒక నిర్థారణకు వచ్చింది. ఆ మేరకు కోర్టుకు పక్కా ఆధారాలను సీబీఐ సమర్పించింది. గుగూల్ టేకౌట్ వివేకా హత్యను బయటపెట్టింది. హత్య జరిగిన రోజు అవినాష్ , ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తదితరులు ఎక్కడ ఉన్నారు? అనేది తేల్చేసింది. మొబైల్ ఫోన్ల ద్వారా హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను సీబీఐ సేకరించింది. ఇప్పుడు ఇక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ హడావుడిగా వెళుతున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవాలని ప్రయత్నిస్తున్నారు.
మోడీ, అమిత్ షా కార్యాలయాల నుంచి జగన్మోహన్ రెడ్డికి (Jagan)
ఇప్పటి వరకు మోడీ, అమిత్ షా కార్యాలయాల నుంచి జగన్మోహన్ రెడ్డికి (Jagan) అపాయిట్మెంట్ ఫిక్స్ కాలేదు. అయినప్పటికీ ఆయన ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమయ్యారు. హడావుడిగా ఆయన ఢిల్లీ వెళుతోన్న దాని వెనుక రాజధాని అంశం ఉందని తాడేపల్లి వర్గాల ఇస్తోన్న లీకులు. జూలై నెలలో విశాఖ వెళ్లేదానికి ఇప్పుడు హడావుడిగా ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదు. పైగా ఈనెల 23వ తేదీన అమరావతి రాజధానిపై కేసు విచారణ సుప్రిం కోర్టులో ఉంది. ఆ రోజున ఏపీ రాజధాని అంశంపై సుప్రీం కోర్టుకు విచారణకు సిద్దమయింది. వాస్తవాలు ఇలా ఉండగా, బకాయిలు, విశాఖ రాజధాని కోసం జగన్మోహన్ రెడ్డి వెళుతున్నారని వస్తోన్న లీకులు అబద్ధం. మరి ఎందుకు, ఢిల్లీ వెళుతున్నారు? అని ప్రశ్న వేసుకుంటే, ఒకటి అవినాష్ రెడ్డి అరెస్ట్రెం, రెండోది కవిత అరెస్ట్ వ్యవహారంలో లాబీయింగ్ (Delhi Tour) చేయడదానికి అంటూ ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి వస్తోన్న సమాధానాలు.
తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్ , వివేకా నందరెడ్డి హత్య కేసులు
సాధారణంగా సీఎం హోదాలో ఢిల్లీకి వెళ్లినప్పుడు అధికారికంగా షెడ్యూల్ మీడియాకు చెబుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడిచే అన్ని వ్యవహారాలను ప్రజల ముందు ఉంచుతారు. కానీ, సీఎంగా జగన్మోహన్ రెడ్డి(Jagan) బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏనాడూ మీడియాకు ఆయన ఢిల్లీ షెడ్యూల్ ను అధికారికంగా చెప్పిన దాఖలాలు లేవు. కేవలం ఢిల్లీ వెళ్లే సమాచారాన్ని మాత్రం లీకుల రూపంలో ఇస్తారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారని మాత్రమే సమాచారం. ఎందుకు వెళుతున్నారు? అనేదానిపై మీడియా తోచిన విధంగా భావిస్తోంది. ప్రస్తుతం పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్ , వివేకా నందరెడ్డి హత్య కేసులు ఏ రోజుకారోజు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అందుకే, ఆ రెండు కేసుల గురించి జగన్ ఢిల్లీ (Delhi Tour)వెళుతున్నారని సర్వసాధారణం ఎవరైనా అనుకోవడంలో తప్పులేదేమో!
Also Read : Viveka: అవినాష్ ను కాపాడుతోన్న జగన్!అఫిడవిట్ లో సునీత!

Related News

YCP-Jagan : పెద్ద `రెడ్ల`తో పెట్టుకుంటే అంతే.! జగన్ రీ థింక్!
వడ్ల రకాలు ఎన్నో `రెడ్డి` సామాజికవర్గంలోని(YCP-Jagan) ఉప కులాలు అన్ని ఉంటాయని పెద్దల సామెత.